తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. బంగాల్ సీఎంగా వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జగ్దీప్ ధన్ఖర్.. మమతతో ప్రమాణం చేయించారు. కొవిడ్ నేపథ్యంలో అతి తక్కువ మంది సమక్షంలో నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది.
బంగాల్ ముఖ్యమంత్రిగా భాద్యతలు చెపట్టిన 8వ నేత మమత. మొత్తంగా ఆ రాష్ట్రానికి 21వ సీఎం.
కరోనాను కట్టడి చేయడమే తన తొలి ప్రాధాన్యమని బాధ్యతలు స్వీకరించిన అనంతరం మమత స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటం రెండో ప్రాధాన్యమన్నారు. బంగాల్లో హింసాత్మక ఘటనలను నిరసిస్తూ మమత ప్రమాణ స్వీకారం చేసిన రోజే భాజపా రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టి నిరసన వ్యక్తం చేసింది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఈ నిరసనల్లో పాల్గొన్నారు.
వేదికపైనే సెటైర్లు..
ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం మమతను ఉద్దేశించి గవర్నర్ కీలక వ్యాఖ్యలు వేశారు. ముందు బంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసను ఆపేలా సీఎం చర్యలు తీసుకోవాలని సూచించారు. శాంతిభద్రతలను పరిరక్షించాలన్నారు.
మోదీ శుభాకాంక్షలు..
బంగాల్ సీఎంగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన మమతా బెనర్జీకి ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
దీదీ లేఖ..
సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రధాని మోదీకి మమత లేఖ రాశారు. ప్రజలందరికీ కరోనా టీకా ఉచితంగా అందించాలని, ఈ కార్యక్రమం పారదర్శకంగా సాగాలన్నారు. రెమ్‌డెసివిర్ సహా ఇతర కీలక ఔషధాలను అవసరాలకు సరిపడా సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. బంగాల్లో ఆక్సిజన్ కొరతతో రోగులు మృతిచెందడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె.. ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు.
18ఏళ్లు పైబడిన వారికి టీకాలు ఇచ్చేందుకు సరిపడా వ్యాక్సిన్లు లేవని, ఈ సమస్యను తీర్చాల్సిన అవసరం ఉందని కూడా లేఖలో మమత ప్రస్తావించారు.
కరోనా కట్టడికి చర్యలు..
బాధ్యతలు చేపట్టిన వెంటనే బంగాల్లో కరోనా కట్టడికి మమత చర్యలు చేపట్టారు. అన్ని మార్కెట్లు, దుకాణాలు ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7గంటల వరకే తెరిచి ఉంచాలని ఆదేశించారు. లోకల్ రైళ్లను గురువారం నుంచి నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ, మెట్రోలో 50 శాతం ప్రయాణికులే ఉండాలన్నారు. మాస్కు ధరించడం తప్పనిసరి చేశారు. ప్రభుత్వ కార్యలయాల్లో 50 శాతం సిబ్బందితో విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.
బంగాల్ అంటే ఐక్యత..
బంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం చేలరేగిన హింసపై దీదీ స్పందించారు. అలాంటి ఘటనలను సహించేది లేదని తేల్చి చెప్పారు. భాజపా గెలిచిన ప్రాంతాల్లోనే ఎక్కువ అల్లర్లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆ పార్టీ పాత వీడియోలను ఉపయోగించుకుని తప్పుడు ఘటనలను చిత్రీకరిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలోనూ ఇలానే జరిగిందన్నారు. అన్ని పార్టీలు వెంటనే ఇలాంటి పనులకు ఆపాలన్నారు. బంగాల్ ఐక్యతకు నిదర్శని చెప్పారు.
9న మంత్రిమండలి
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 9న మమత తన కేబినెట్‌ను విస్తరించే అవకాశాలున్నాయని టీఎంసీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: ప్రభుత్వ ఏర్పాటుకు స్టాలిన్‌ను ఆహ్వానించిన గవర్నర్