ETV Bharat / bharat

సాహితీవేత్త నరేంద్ర కోహ్లీ మృతి-ప్రధాని సంతాపం

author img

By

Published : Apr 18, 2021, 6:19 AM IST

ప్రముఖ హిందీ రచయిత నరేంద్ర కోహ్లీ మరణంపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. హిందీ సాహిత్య రంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ప్రముఖ న్యాయవాది కే.జే. శ్నేతా మరణంపైనా మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

modi
నరేంద్ర మోదీ

ప్రఖ్యాత హిందీ రచయిత, సాహితీవేత్త నరేంద్ర కోహ్లీ దిల్లీలో మరణించారు. ఆయన మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. కోహ్లీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

పౌరాణిక, చారిత్రక పాత్రలను తన రచనల్లో కోహ్లీ సజీవంగా చిత్రీకరించారని మోదీ తెలిపారు. హిందీ సాహిత్య రంగానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని చెప్పారు.

''ప్రసిద్ధ సాహిత్యవేత్త నరేంద్ర కోహ్లీ మరణంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. పౌరాణిక, చారిత్రక పాత్రలను సజీవంగా చిత్రీకరించిన ఆయనను సాహిత్య రంగం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా.''

-ట్వీట్టర్​లో మోదీ

ప్రముఖ న్యాయవాది కే.జే శేత్నా మరణంపై ప్రధాని సంతాపం తెలిపారు. న్యాయ రంగానికి ఆయన చేసిన కృషి, అందించిన సహకారం మరువలేనివని.. అనేక సమాజ సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవారని మోదీ కొనియాడారు.

''న్యాయ కోవిదుడు, ప్రముఖ న్యాయవాది శ్రీ కే.జే.శేత్నా మరణించినందుకు బాధగా ఉంది. ఈ విచార సమయంలో ఆయన కుటుంబం సభ్యులకు ధైర్యం కలగాలని ఆశిస్తున్నా.''

-ప్రధాని మోదీ

ఇవీ చదవండి: మాజీ సీఎం కుమారస్వామి‌కి కరోనా పాజిటివ్​

దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.