ETV Bharat / bharat

'కరోనాను జయించడానికి​ ప్రపంచం ఐక్యం కావాలి'

author img

By

Published : Apr 13, 2021, 9:18 PM IST

Updated : Apr 13, 2021, 10:45 PM IST

ఏడాది కాలంగా కరోనా ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తోందన్నారు ప్రధాని మోదీ. మహమ్మారిని జయించడానికి ప్రపంచం మొత్తం ఏకం కావాలని పిలుపునిచ్చారు.

PM Modi calls for united global efforts to defeat COVID pandemic
'మహమ్మారిని జయించడానికి​ ప్రపంచం ఐక్యం కావాలి'

కొవిడ్ 19 సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 130 కోట్ల భారతీయులను కాపాడుకుంటూనే.. వైరస్​పై పోరాటంలో ఇతర దేశాలకు సహకారం అందిస్తున్నట్లు మంగళవారం వర్చువల్​గా జరిగిన 'రైజీనా సదస్సు'లో చెప్పారు.

పాస్​పోర్టు రంగుతో సంబంధం లేకుండా ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ వైరస్​ నుంచి బయటపడితే తప్ప మహమ్మారిని జయించలేం. అందుకే ఎన్ని అవరోధాలు ఉన్నప్పటికీ 80కి పైగా దేశాలకు టీకాలను సరఫరా చేశాం.

- నరేంద్ర మోదీ, ప్రధాని

నేటి సమస్యలను, రేపటి సవాళ్లను ఎదుర్కోగలిగే వ్యవస్థలను మనం సృష్టించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. కరోనాపై పోరులో భారత్​ అనుభవాలు, జ్ఞానం, వనరులను ఎప్పటిలాగే ఇతర దేశాలతో పంచుకుంటామని హామీఇచ్చారు.

ఇదీ చూడండి: 'టీకా కొరత లేదు.. ప్రణాళిక లేకపోవడమే సమస్య'

Last Updated : Apr 13, 2021, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.