ETV Bharat / bharat

'బంగాళాఖాతాన్ని వారధిగా మార్చుదాం.. మన లక్ష్యాన్ని సాధిద్దాం' - బిమ్​స్టెక్ మోదీ ప్రసంగం

Modi BIMSTEC summit: బిమ్​స్టెక్ బడ్జెట్ కోసం భారత్ తరఫున ఒక మిలియన్ డాలర్లు అందించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. బిమ్​స్టెక్​ సామర్థ్యాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. బంగాళాఖాతాన్ని అనుసంధాన వారధిగా మార్చే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.

MODI NEWS
MODI NEWS
author img

By

Published : Mar 30, 2022, 11:12 AM IST

Updated : Mar 30, 2022, 12:48 PM IST

Modi BIMSTEC summit: ఐరోపాలో ఇటీవలి పరిణామాలు అంతర్జాతీయ శాంతి భద్రతలపై ప్రశ్నలు లేవనెత్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ సహకారానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడిందని చెప్పారు. బిమ్​స్టెక్ ఐదవ శిఖరాగ్ర సదస్సులో మాట్లాడిన మోదీ.. ఈ సంస్థ అభివృద్ధి కోసం సరికొత్త చార్టర్​ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. సభ్య దేశాల మధ్య అత్యున్నత సహకారం అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బంగాళాఖాతాన్ని అనుసంధానతకు, శ్రేయస్సుకు, భద్రతకు వారధిగా మార్చాల్సిన తరుణం ఆసన్నమైందని ఉద్ఘాటించారు.

modi
బిమ్​స్టెక్ సదస్సులో మోదీ

MODI NEWS: బిమ్​స్టెక్ సెక్రెటేరియట్​ కోసం భారత్ ఒక మిలియన్ డాలర్లు అందించనుందని మోదీ ప్రకటించారు. 'ఐరోపాలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయ సుస్థిరతపై అనేక ప్రశ్నలకు దారితీస్తున్నాయి. కాబట్టి, బిమ్​స్టెక్​ సామర్థ్యాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ కూటమిని మరింత క్రియాశీలంగా మార్చాలి. ఆపరేషనల్ బడ్జెట్ పెంచేందుకు తాము ఇచ్చే నిధులు ఉపయోగపడతాయి. ఇందుకోసం బిమ్​స్టెక్ సెక్రెటరీ జనరల్ రోడ్​మ్యాప్ సిద్ధం చేయాలి. బంగాళాఖాతాన్ని అనుసంధాన వారధిగా మార్చే సమయం వచ్చేసింది. బిమ్​స్టెక్ దేశాలన్నీ ఇందుకోసం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిస్తున్నా. 1997లో మాదిరిగానే మనం మన లక్ష్యాలను నూతన ఉత్సాహంతో సాధించాలి. ఈ సదస్సు ఫలితాలు.. బిమ్​స్టెక్ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖిస్తాయి' అని మోదీ పేర్కొన్నారు.

వాతావరణ కేంద్రానికి 30 లక్షల డాలర్లు: సభ్య దేశాల మధ్య వర్తకాన్ని పెంపొందించే బిమ్​స్టెక్ ఎఫ్​టీఏ ప్రతిపాదనపై వేగంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. సభ్య దేశాల్లోని స్టార్టప్​లు, వ్యాపారుల మధ్య మరింత సమాచార మార్పిడి జరిగేలా చూడాలని పిలుపునిచ్చారు. వర్తకం విషయంలో అంతర్జాతీయ నిబంధనలను ప్రవేశపెట్టే అంశాన్ని ప్రయత్నించాలని సూచించారు. బిమ్​స్టెక్ ఆధ్వర్యంలోని వాతావరణ, శీతోష్ణస్థితి కేంద్రం ప్రాముఖ్యతను మోదీ ప్రస్తావించారు. విపత్తుల నిర్వహణ, వాటి ముప్పు తగ్గించే విషయంలో ఈ కేంద్రం మెరుగ్గా పనిచేస్తుందని అన్నారు. ఈ సంస్థను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు భారత్ తరఫున 3 మిలియన్ డాలర్ల నిధులు అందిస్తామని ప్రకటించారు. మరోవైపు, నలంద అంతర్జాతీయ యూనివర్సిటీ ఇస్తున్న బిమ్​స్టెక్ స్కాలర్​షిప్ కార్యక్రమ పరిధిని పెంచుతున్నట్లు మోదీ తెలిపారు. క్రిమినల్ కేసుల విషయంలో న్యాయ సహాయం కోసం ఒప్పందంపై సంతకం చేస్తున్నట్లు సమావేశంలో ప్రకటించారు.

దక్షిణ, ఆగ్నేయాసియాలో ఉన్న ఏడు దేశాల కూటమిని బిమ్​స్టెక్​గా వ్యవహరిస్తారు. వివిధ రంగాల్లో ఆర్థిక, సాంకేతిక సహకారం కోసం ఈ కూటమిని ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్, శ్రీలంక, మయన్మార్, థాయ్​లాండ్ దేశాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి.

ఇదీ చదవండి: దళితుడిపై దారుణం.. హింసించి.. చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి..

Last Updated : Mar 30, 2022, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.