పౌరుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కొవిడ్-19 బారినపడిన రోగులకు వైద్యం, ఔషధాలు, ఆక్సిజన్, ఐసీయూ, పడకలు, వెంటిలేటర్ సదుపాయం తదితరాలన్నిటినీ కల్పించాలని ఆదేశించింది. తన శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోతున్నా ఐసీయూ పడక లభించడం లేదంటూ 53ఏళ్ల వ్యక్తి దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు తగిన వైద్యం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పిటిషనర్ ఒక్కరికే కాకుండా.. దిల్లీ నగరంలో కరోనా బారినపడిన వారందరికీ...ప్రాణ రక్షణకు అవసరమైన అన్ని సదుపాయాలు అందేలా చూడాలని స్పష్టం చేసింది. దిల్లీలో వైద్య సదుపాయాల లేమిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయాలు పక్కన పెట్టి పౌరుల ప్రాణాల రక్షణకు కృషి చేయాలని జస్టిస్ విపిన్ సంఘ్, జస్టిస్ రేఖా పల్లిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. తప్పించుకొనే ధోరణి తగదని పేర్కొంది.
ఇదీ చూడండి: తమిళనాడు సీఎంగా స్టాలిన్ నేడు ప్రమాణం