ETV Bharat / bharat

విజయన్ ప్రమాణానికి అడ్డంకులు-సుప్రీంలో పిటిషన్

author img

By

Published : May 19, 2021, 5:21 AM IST

కేరళ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్న పినరయ్ విజయన్​కు అవరోధాలు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో కొవిడ్ విజృంభణ కారణంగా.. కేవలం 75 మందితోనే ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరపాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.

pinarayi vijayan
పినరయి విజయన్, కేరళ సీఎం

కేరళ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్న పినరయ్ విజయన్​కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా.. కేవలం 75 మందితోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించేలా కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కేఎం షాజహాన్​ అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తొలుత.. ప్రమాణస్వీకార వేదికను తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియం నుంచి రాజ్ భవన్​కు మార్చాలని కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆహ్వానితులను 50 మందికే పరిమితం చేసేలా ఆదేశించాలని పిటిషనర్​, డెమొక్రటిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జార్జి సెబాస్టియన్ కోరారు.

గవర్నర్​కు లేఖ..

ఓవైపు ప్రమాణస్వీకార కార్యక్రమంపై అడ్డంకులు వస్తుండగా.. సీపీఎం శాసనసభా పక్షనేతగా మంగళవారం ఎన్నికైన అనంతరం ముఖ్యమంత్రి విజయన్ రాజ్​భవన్​కు వెళ్లి గవర్నర్​ను కలిశారు. గవర్నర్​ అరిఫ్ మహమ్మద్ ఖాన్​ను కలిసి సంబంధిత లేఖను సమర్పించారు.

ఈ నెల 20న కొవిడ్ నిబంధనలతో 50 వేల సామర్థ్యం గల సెంట్రల్ స్టేడియంలో 500 మంది అతిథులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు.

ఇదీ చదవండి:'ఆర్మీ' పేపర్​ లీక్​: సికింద్రాబాద్ కల్నలే సూత్రధారి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.