ETV Bharat / bharat

దేశంలో తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు - వైరస్ పాజిటివిటీ రేటు తగ్గుదల

దేశంలో గత మూడు రోజులుగా కరోనా కేసుల సంఖ్య స్థిరంగా నమోదవుతోందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. పాజిటివిటీ రేటులో తగ్గుదల కనిపిస్తోందని వెల్లడించింది.

Covid
కరోనా
author img

By

Published : May 13, 2021, 7:23 PM IST

దేశంలో గత మూడు రోజులుగా కరోనా కేసుల సంఖ్య స్థిరంగా నమోదవగా.. పాజిటివిటీ రేటులో తగ్గుదల కనిపించిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కానీ 10 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు ఇంకా 25 శాతం నమోదవుతోందని స్పష్టం చేసింది. ఏప్రిల్ 22-28 నుంచి మే 6-12 మధ్య కొవిడ్ కేసులను పోల్చితే.. పాజిటివిటీ రేటు తగ్గిన జిల్లాల సంఖ్య 125 నుంచి 338కి పెరిగిందని పేర్కొంది.

అయితే.. 12 రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య ఒక లక్ష దాటిందని అధికారులు తెలిపారు. 24 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 15 శాతానికి పైగానే ఉందని వెల్లడించారు.

దేశంలో గురువారం 3,62,727 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,37,03,665కి చేరింది.

ఇదీ చదవండి: 12-16 వారాల తర్వాతే కొవిషీల్డ్​ రెండో డోసు

:వలస కార్మికులకు రేషన్ ఇవ్వండి: సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.