Pinarayi Vijayan meets Modi: దిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. మోదీతో పలు విషయాలపై చర్చించినట్లు ప్రధాని కార్యాలయం(పీఎంఓ) ట్వీట్ చేసింది. మోదీతో విజయన్ సమావేశమైన చిత్రాలను పోస్ట్ చేసింది. సిల్వర్‌లైన్(కే-రైల్ ప్రాజెక్ట్) సహా పలు కీలక అంశాలపై మోదీతో విజయన్ చర్చించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం చూస్తున్నారు విజయన్. కొచి-బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్ కోసం భూసేకరణ వేగవంతంగా సాగుతున్నట్లు కేరళ సీఎం ప్రకటించిన మరుసటి రోజునే ఈ భేటీ జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే, సిల్వర్‌లైన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పలువురు ఆందోళన చేస్తున్న క్రమంలో భేటీ కీలకంగా మారింది.
పోలీసులు, ఎంపీల మధ్య ఘర్షణ: కే-సిల్వర్ లైన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దిల్లీలోని విజయ్ చౌక్ నుంచి పార్లమెంట్ వరకు యూడీఎఫ్ ఎంపీలు నిరసన ర్యాలీ చేపట్టారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. స్వల్ప ఘర్షణ తలెత్తింది. పోలీసులు తమను అడ్డుకోవటమే కాకుండా అనుచితంగా ప్రవర్తించారని ఓ కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు. దీనిపై దిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు. 'అక్కడ ఎవరిపైనా చేయి చేసుకోలేదు. వారి గురించి ఏమీ చెప్పకుండా నినాదాలు చేస్తూ పార్లమెంట్ వైపు దూసుకెళ్తుండగా బారికేడ్ల వద్దే ఉండి సిబ్బంది అడ్డుకున్నారు. గుర్తింపు కార్డులు అడగగా చూపించేందుకు నిరాకరించారు. కొద్దిసేపటికి గేట్-1 వద్ద ఉన్న భద్రతా సిబ్బంది వారు ఎంపీలను దిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత వారిని నిరసన తెలిపేందుకు అనుమతించాం.' అని వివరించారు.
-
#WATCH | Delhi: A scuffle breaks out between police forces & Kerala's UDF MPs while they were protesting at Vijay Chowk against Kerala's K-Silver line project pic.twitter.com/V1Ll3HlqJJ
— ANI (@ANI) March 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Delhi: A scuffle breaks out between police forces & Kerala's UDF MPs while they were protesting at Vijay Chowk against Kerala's K-Silver line project pic.twitter.com/V1Ll3HlqJJ
— ANI (@ANI) March 24, 2022#WATCH | Delhi: A scuffle breaks out between police forces & Kerala's UDF MPs while they were protesting at Vijay Chowk against Kerala's K-Silver line project pic.twitter.com/V1Ll3HlqJJ
— ANI (@ANI) March 24, 2022
మోదీతో భగవంత్ మాన్ భేటీ: పంజాబ్ నూతన ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. దిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై మోదీతో చర్చించినట్లు అధికావర్గాలు తెలిపాయి. అనంతరం దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ జాతీయ కార్యదర్శి అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశం కానున్నారని పేర్కొన్నాయి.