ETV Bharat / bharat

కరోనా మూడో దశపై ఐఎంఏ కీలక హెచ్చరికలు - భారత్​లో కరోనా మూడో ఉద్ధృతి

తీర్థయాత్రలు, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనటం అవసరమే అయినప్పటికీ మరికొన్ని నెలలు ఆగాల్సిన అవసరం ఉందని ఐఎంఏ సూచించింది. కొవిడ్‌ నిబంధనల విషయంలో ప్రజలు, ప్రభుత్వాలు ఏమీ పట్టనట్లు వ్యవహరించటంపై ఆందోళన వ్యక్తం చేసింది.

ima about corona third wave
కరోనా మూడో దశ
author img

By

Published : Jul 12, 2021, 5:49 PM IST

కరోనా మూడోదశ వ్యాప్తి అనివార్యమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను భారతీయ వైద్యుల సంఘం(ఐఎంఏ) హెచ్చరించింది. సామూహిక కార్యక్రమాల సందర్భంగా కొవిడ్‌ నిబంధనల విషయంలో ప్రజలు, ప్రభుత్వాలు ఏమీ పట్టనట్లు వ్యవహరించటంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలే కరోనా మూడోదశ వ్యాప్తికి బలమైన కారకాలని ఐఎంఏ అభిప్రాయపడింది.

"పర్యటక స్థలాల సందర్శన, తీర్థయాత్రలు, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనటం అవసరమే అయినప్పటికీ.. మరికొన్ని నెలలు ఆగాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ పరిస్థితులు, మహమ్మారుల చరిత్ర ప్రకారం కరోనా మూడోదశ తప్పకుండా వస్తుంది. మూడోదశ వ్యాప్తికి సమయం ఆసన్నమైంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి."

-ఐఎంఏ

పూరీలో జగన్నాథ రథయాత్ర ప్రారంభం కావటం సహా ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో కన్వర్‌ యాత్రకు అనుమతిపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఐఎంఏ ఈ ప్రకటన చేసింది. సామూహిక కార్యక్రమాలను నియంత్రించాలని రాష్ట్రప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది.

ఇదీ చూడండి: జికా వైరస్.. కరోనా కంటే ప్రమాదకరమా?

ఇదీ చూడండి: Covid: థర్డ్‌వేవ్‌కు బలమైన సంకేతాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.