disqualification of candidates in election: తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించేలా ఉత్తర్వులివ్వాలంటూ 2020లో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం(పిల్)పై తక్షణ విచారణ జరిపే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాజ్యాన్ని విచారించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
న్యాయవాది, భాజపా నేత అశ్వనీ ఉపాధ్యాయ్ 2020 సెప్టెంబరులో ఈ పిటిషన్ వేశారు. నాటి నుంచి ఒక్కసారి కూడా ఇది లిస్ట్ కాలేదు. తీవ్ర అభియోగాలు ఎదుర్కొనే వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించేలా కేంద్రానికి, ఎన్నికల సంఘాని (ఈసీ)కి ఆదేశాలివ్వాలని పిటిషనర్ కోరారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి:UP polls 2022: యూపీ సమరంలో మానసిక యుద్ధం