ETV Bharat / bharat

'ఉపరాష్ట్రపతి, ఆ కేంద్రమంత్రిని తొలగించాలి'.. సుప్రీంలో పిటిషన్​ - మంత్రికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిల్

ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. వారిని ఆ పదవుల నుంచి తొలగించాలని పిటిషన్​లో ఉంది. బాంబే న్యాయమూర్తుల సంఘం మంగళవారం సుప్రీం కోర్టులో ఈ పిటిషన్​ దాఖలు చేసింది.

pil-in-supreme-court-against-vice-president-and-central-minister
ఉపరాష్ట్రపతికి, కేంద్రమంత్రికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిల్​
author img

By

Published : Mar 28, 2023, 7:47 PM IST

న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. బాంబే న్యాయవాదుల సంఘం ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఇంతకుముందు న్యాయవాదుల సంఘం.. బాంబే హైకోర్టులో ఇదే పిల్​​ను దాఖలు చేయగా.. కోర్టు దాన్ని కొట్టివేసింది. దీంతో న్యాయవాదులు సంఘం.. సుప్రీంలో సవాల్‌ చేసింది. న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై ధన్‌ఖడ్‌, రిజిజు చేస్తున్న వ్యాఖ్యలు రాజ్యాంగంపై విశ్వాసం లేనట్లు ఉన్నాయని పిల్‌లో పేర్కొంది. న్యాయవ్యవస్థతోపాటు రాజ్యాంగంపై దాడి చేస్తున్న ఆ ఇద్దరిని పదవి నుంచి తొలగించాలని న్యాయవాదుల సంఘం కోరింది. ధన్‌ఖడ్‌, రిజిజు ప్రవర్తన సుప్రీంకోర్టు ప్రతిష్టను తగ్గించిందని పిటిషన్‌లో పేర్కొంది.

కాగా కొద్ది రోజుల క్రితం కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్​ రిజిజు.. ఉన్నత న్యాయస్థాలనకు జడ్జీలను నియామకం చేసే కోలిజియం వ్యవస్థ పారదర్శకంగా లేదని వ్యాఖ్యానించారు. 1973లో రాజ్యాంగ మౌలిక స్వరూపంపై తీర్పునిచ్చిన కేశవానంద భారతి కేసును ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్‌ఖడ్‌ ప్రశ్నించారు. ఈ తీర్పు చెడ్డ ఉదాహరణగా నిలిచిందని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంటు అధికారాన్నే ప్రశ్నిస్తే మనది ప్రజాస్వామ్య దేశమని చెప్పడం కష్టమని న్యాయవ్యవస్థను ఉద్దేశిస్తూ అన్నారు.

దోషులుగా తేలాక రాజకీయ పార్టీలు ఏర్పాటు చేయవద్దని పిల్​..
వివిధ నేరాల్లో దోషులుగా శిక్షపడ్డవారు రాజకీయ పార్టీలు ఏర్పాటు చేయకుండా, వాటిని నిర్వహించకుండా నిషేదం విధించాలన్న పిటిషన్​పై.. మే నెలలో వాదనలు వింటామని సుప్రీం కోర్టు తెలిపింది. దీనిపై ఏప్రిల్​ 5, 6 తేదిల్లో వాదనలు వినాలన్న న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ అభ్యర్థనను జస్టిస్​ కేఎం జోసెఫ్​, జస్టిస్​ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్​ తిరస్కరించింది. దీనిపై విచారణకు అంత తొందరెందుకని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ ప్రశ్నించిన బెంచ్​.. మే మొదటి వారంలో వాదనలు వింటామని తెలిపింది. కాగా, 2017లో అశ్విని ఉపాధ్యాయ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు.

విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో మత సామరస్యాన్ని కాపాడుకునేందుకు విద్వేషపూరిత ప్రసంగాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. విద్వేష ప్రసంగాలకు వ్యతిరేకంగా దాఖలైన ఓ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మానసం విచారణ చేపట్టింది. ఇందుకు సంబంధించి 18 కేసులు నమోదు చేసినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. కేవలం కేసుల నమోదుతో ఈ సమస్య పరిష్కారం కాదన్న ధర్మాసనం.. F.I.Rల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని సొలిసిటర్ జనరల్‌ ను ప్రశ్నించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

విద్వేష ప్రసంగాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని గతంలోనూ సుప్రీంకోర్టు పేర్కొంది. ఫిర్యాదు కోసం ఎదురుచూడకుండా సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఎంతో తీవ్రమైన ఈ సమస్యపై చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం ఏదైనా జాప్యం చేస్తే.. కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని కూడా హెచ్చరించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.