ETV Bharat / bharat

'హిమాలయాల్లో పెరిగే మొక్కలో 'కొవిడ్​'ను నిరోధించే శక్తి!'

Phytochemicals in plants: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నివారించే ఫైటోకెమికల్స్​ను హిమాలయాల్లోని ఓ మొక్కలో గుర్తించారు ఐఐటీ పరిశోధకులు. శాస్త్రీయ పద్ధతుల్లో పరీక్షించి కరోనా వైరస్​ను నిరోధిస్తున్నట్లు తేల్చారు. టీకాయేతర ఔషధాల కోసం జరుగుతున్న అన్వేషణలో ఈ మొక్కల్లో లభించే ఫైటోకెమికల్స్​ కీలకంగా మారనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Phytochemicals
హిమాలయ మొక్కలో 'కొవిడ్​'ను నిరోధించే ఫైటోకెమికల్స్​
author img

By

Published : Jan 17, 2022, 3:40 PM IST

Updated : Jan 17, 2022, 6:35 PM IST

Phytochemicals in plants: హిమాలయాల్లో ఎన్నో అద్భుతాలు దాగున్నాయని, చాలా రోగాలను నయం చేసే ఆయుర్వేద మూలికలు దొరుకుతాయని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడు ఆ మాట నిజమని నిరూపించారు కొందరు శాస్త్రవేత్తలు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్​-19 వైరస్​ను నిరోధించే ఫైటోకెమికల్స్​ కలిగిన మొక్కను గుర్తించారు.

Himalayan plant
బురాన్ష్​ మొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్న పరిశోధకులు

హిమాచల్​ప్రదేశ్​, మండిలోని ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ(ఐఐటీ), ఇంటర్​నేషనల్​ సెంటర్​ ఫర్​ జెనటిక్​ ఇంజినీరింగ్​ అండ్​ బయోటెక్నాలజీ (ఐసీజీఈబీ) పరిశోధకులు.. కొవిడ్​-19 చికిత్సలో కీలకమైన ఫైటోకెమికల్స్​ను హిమాలయాల్లోని 'రోడోడెండ్రాన్​ అర్బోరియం' అనే మొక్క పూరేకుల్లో గుర్తించారు. ఈ మొక్కను స్థానికంగా 'బురాన్ష్​'గా పిలుస్తారు. ఈ ఫైటోకెమికల్స్​ వైరస్​కు వ్యతిరేకంగా పోరాడతాయి.

Himalayan plant
మొక్కలోని ఫైటోకెమికల్స్​ను పరీక్షిస్తున్న శాస్త్రవేత్త

ఈ అధ్యయనం ఇటీవలే 'బయోమాలిక్యులార్​ స్ట్రక్చర్​ అండ్​ డైనమిక్స్​' జర్నల్​లో ప్రచురితమైంది.

Himalayan plant
బురాన్ష్​ మొక్క పూరేకుల నుంచి తీసిన రసం

" వైరస్​పై శరీరానికి పోరాడే శక్తిని ఇచ్చే పద్ధతుల్లో వ్యాక్సిన్​ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా టీకాయేతర ఔషధాలను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా ఔషధాల్లో రసాయనాలు ఉంటాయి. ఇవి మన శరీర కణాలలోని గ్రహకాలను బంధిస్తాయి, వైరస్​ ప్రవేశించకుండా నిరోధిస్తాయి. అలాగే.. శరీరంలో వైరస్​ ప్రవేశించినా వృద్ధి చెందకుండా అడ్డుకుంటాయి. వివిధ రకాల చికిత్సలపై అధ్యయనం చేశాక.. మొక్కల నుంచి తీసుకున్న రసాయనాలు- ఫైటోకెమికల్స్​ వైరస్​ను నిరోధించటంలో కీలకంగా మారుతున్నాయని తెలిసింది."

- శ్యామ్​ కుమార్​ మసకపల్లి, ఐఐటీ మండిలో అసోసియేట్​ ప్రొఫెసర్​.

హిమాలయాల్లో దొరికే బురాన్ష్​ మొక్కల పూరేకులను స్థానికులు ఎన్నో ఏళ్ల నుంచి వివిధ రకాల చికత్సల్లో వినియోగిస్తున్నారు. ఈ పూరేకుల్లో వివిధ రకాల ఫైటోకెమికల్స్​ ఉన్నట్లు శాస్త్రీయంగా పరీక్షించినట్లు చెప్పారు శ్యామ్. ముఖ్యంగా యాంటీవైరల్​ గుణాలపై దృష్టిపెట్టినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:

Sewage Samples : కరోనా వ్యాప్తి కట్టడిపై పరిశోధన సంస్థల దృష్టి

'ఇవి.. కరోనాను అడ్డుకునే సరికొత్త యాంటీబాడీలు'

Last Updated : Jan 17, 2022, 6:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.