ETV Bharat / bharat

పెంపుడు శునకాన్ని కారుకు కట్టి.. ఈడ్చుకెళ్లి..

కేరళ రాష్ట్రంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. పెంపుడు శునకాన్ని వదిలించుకోవాలనే ఉద్దేశంతో.. కర్కశంగా ప్రవర్తించాడో వ్యక్తి. కారు వెనకాల కట్టేసి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత కటకటాలపాలయ్యాడు.

Pet dog tied to car, dragged down road; Man arrested in Kerala
శునకంపై క్రూరత్వం.. కారుకు కట్టి ఈడ్చుకెళ్లిన వ్యక్తి
author img

By

Published : Dec 12, 2020, 10:38 AM IST

కేరళలో అమానవీయ ఘటన జరిగింది. మూగజీవి అనే కాస్తైనా కనికరం లేకుండా.. తన పెంపుడు శునకంపై కర్కశంగా ప్రవర్తించాడో వ్యక్తి. కుక్క మెడకు తాడు కట్టి తన కారుతో రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. అటుగా వెళ్తున్న మరో వ్యక్తి ఈ దృశ్యాన్ని తన చరవాణిలో బంధించగా.. ఇప్పుడీ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

శునకంపై క్రూరత్వం.. కారుకు కట్టి ఈడ్చుకెళ్లిన వ్యక్తి

ఏం జరిగిందంటే.?

ఎర్నాకుళం జిల్లా పారావుర్​కు చెందిన యూసుఫ్​.. తన పెంపుడు శునకాన్ని తాడుతో కారుకు కట్టి విచక్షణా రహితంగా రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఈ దృశ్యాన్ని అటుగా బైక్​పై వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి.. పోలీసులకు సమాచారమిచ్చాడు. అనంతరం యూసుఫ్​ను అరెస్ట్​ చేశారు పోలీసులు. గాయపడిన శునకాన్ని స్థానిక పశు వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేయించారు.

నిందితుడిపై కేసు

శునకంపై క్రూరంగా ప్రవర్తించిన యూసుఫ్​ కారును స్వాధీనం చేసుకోవడం సహా.. అతడి డ్రైవింగ్​ లైసెన్స్​ను రద్దు చేశారు. అంతేకాకుండా.. ఐపీసీ సెక్షన్స్​ 428(జంతువధ), 429(జంతు క్రూరత్వ నిషేధం); యానిమల్​ యాక్ట్​ సెక్షన్ 11(1) కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇదీ చదవండి: పేద విద్యార్థులకు వరంలా మారిన 'బోల్కీశాల'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.