Holi Celebrations india: రంగుల పండగ హోలీని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. ఉదయం నుంచే రంగులు జల్లుకుంటా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. పలు చోట్ల నృత్యాలు, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు.
హోలీ సందర్భంగా ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. రంగుల పండగ అందరి జీవితాల్లో ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా, రాజ్నాథ్ సింగ్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
ఉత్తర్ప్రదేశ్ మథురలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజలు భారీ ఎత్తున సంబరాల్లో పాల్గొన్నారు.
గుజరాత్లో చిన్నారులు, మహిళలు రంగల జల్లుకుని నృత్యాలు చేసి హోలీ పండగ చేసుకున్నారు.
హోలీ సందర్భంగా హోలికా దహన్ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు.