ETV Bharat / bharat

'పెగాసస్​ను కేంద్రం ఉపయోగించిందా? లేదా?' - పెగాసస్ సుప్రీంకోర్టులో వ్యాజ్యం

పెగాసస్ గూఢచర్యం వ్యవహారంపై స్వతంత్ర విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు ప్రముఖ పాత్రికేయులు ఎన్ రామ్, శశి కుమార్​. ఈ సాఫ్ట్​పేర్​ను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఉపయోగించిందా లేదా అన్న విషయంపై కేంద్రం స్పష్టతనివ్వాలని కోరారు.

pegasus
పెగాసస్
author img

By

Published : Jul 27, 2021, 2:26 PM IST

పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై స్వతంత్ర విచారణ జరపాలని కోరుతూ పలువురు జర్నలిస్టులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్టింగ్ లేదా విశ్రాంత న్యాయమూర్తి ద్వారా ఈ దర్యాప్తు జరిపించాలని సీనియర్ పాత్రికేయులు ఎన్ రామ్, శశి కుమార్​.. దేశ అత్యున్నత ధర్మాసనాన్ని కోరారు. ఏ విధమైన నిఘా కోసమైనా పెగాసస్ స్పైవేర్​ను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఉపయోగించారా అన్న విషయంపై సమాధానం చెప్పేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. ఈ సాఫ్ట్​వేర్ లైసెన్సు ప్రభుత్వం వద్ద ఉందా అన్న విషయంపై స్పష్టతనివ్వాలని అభ్యర్థించారు.

జర్నలిస్టులు, న్యాయవాదులు, మంత్రులు, విపక్ష నేతలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలా మొత్తం 142 మంది భారతీయులు పెగాసస్ లక్షిత జాబితాలో ఉన్నట్లు పలు పత్రికలు చేపట్టిన విచారణలో తేలిందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఇందులో కొందరి ఫోన్లు హ్యాక్​ అయినట్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో వెల్లడైందని చెప్పారు. ఇలా చేయడం ప్రాథమిక హక్కులకు విరుద్ధమని పేర్కొన్నారు.

"మిలిటరీ గ్రేడ్ స్పైవేర్​ను ఉపయోగించి నిఘా పెట్టడం ఆమోదయోగ్యం కాదు. ఇది గోప్యత హక్కుకు విరుద్ధం. ఇలా చేయడం ఒకరి జీవితంలోని వ్యక్తిగత అంశాల్లోకి చొరబడటమే. మంత్రులు, సీనియర్ రాజకీయ నేతల ఫోన్లు హ్యాక్ చేసి.. నిందితులు సైబర్ టెర్రరిజానికి పాల్పడ్డారు. కీలకమైన సమాచారాన్ని లక్ష్యంగా చేసుకున్నారు."

-పిటిషనర్లు

పెగాసస్ వ్యవహారంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరుతూ సీపీఎం రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ వ్యాజ్యం దాఖలు చేశారు. మరోవైపు, సిట్ విచారణ జరిపించాలని న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.