ETV Bharat / bharat

'ఫోన్ ట్యాపింగ్​ వార్తలు అవాస్తవం!' - pegasus data leak

దేశంలోని ప్రముఖుల ఫోన్లను 'పెగాసస్' అనే స్పైవేర్ సాయంతో హ్యాక్ చేసినట్లు వచ్చిన వార్తలను ఆ సాఫ్ట్​వేర్​ను విక్రయించే ఎన్ఎస్ఓ గ్రూప్ ఖండించింది. తమ సర్వర్ల నుంచి డేటా లీక్ అయిన విషయం అవాస్తవమని తెలిపింది. కథనంలో పేర్కొన్న సమాచారం తమ సర్వర్లలోనే లేదని వెల్లడించింది.

nso group, pegasus
పెగాసస్, ఎన్ఎస్ఓ గ్రూప్
author img

By

Published : Jul 19, 2021, 1:52 PM IST

Updated : Jul 19, 2021, 2:24 PM IST

భారత్​లోని కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులు, ప్రముఖుల ఫోన్లను హ్యాక్ చేసినట్లు వచ్చిన వార్తలను సైబర్ నిఘా సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్ ఖండించింది. ఆ కథనాలకు సరైన ఆధారాలు లేవని, అవన్నీ వాస్తవదూరంగా ఉన్నాయని పేర్కొంది. వార్తా సంస్థలు ప్రచురించిన కథనాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈ మేరకు స్పష్టత ఇస్తున్నట్లు వివరించింది. దీనిపై పరువు నష్టం దావానూ వేయనున్నట్లు తెలిపింది.

"ఇటీవల వచ్చిన కథనంలోని ఆరోపణలు.. పూర్తిగా అవాస్తవం. తప్పుడు ఊహాగానాలతో ఎలాంటి ధ్రువీకరణ లేని విషయాలను కథనంలో పేర్కొన్నారు. వారి 'విశ్వసనీయ వర్గాలు' వారికి వాస్తవ దూరంగా ఉన్న సమాచారాన్ని ఇచ్చినట్లు ఉన్నాయి. మా సర్వర్ల నుంచి డేటా లీక్ అయినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా తప్పు. ఎందుకంటే మా సర్వర్లలో అలాంటి సమాచారమే లేదు."

-ఎన్ఎస్ఓ గ్రూప్

మరోవైపు, ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కథనాలను 'అంతర్జాతీయ కుట్ర'గా ఎన్ఎస్ఓ గ్రూప్ పేర్కొంది. తమ క్లెయింట్ల జాబితాలో లోని దేశాల పేర్లనూ కథనంలో పేర్కొన్నారని పేర్కొంది. పెగాసస్ సాఫ్ట్​ ఫోన్లలోకి చొరబడినట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలిన వ్యాఖ్యలకు ఆధారాలు లేవని తెలిపింది.

"మేం మా సాఫ్ట్​వేర్లను ప్రభుత్వాలు, నిఘా సంస్థలకు విక్రయిస్తాం. మాకు విశ్వసనీయమైన వినియోగదారులు ఉన్నారు. మాకు సర్వర్లు లేవు. క్లయింట్ల వద్దే డేటా అంతా ఉంటుంది. 50 వేలకు పైగా పెగాసస్ లక్ష్యాలను గుర్తించినట్లు వారు(వార్తా సంస్థలు) మాకు చెప్పారు. అది చాలా పెద్ద సంఖ్య. ఇప్పుడేమో 180 అంటున్నారు. అది క్రమంగా 37.. ఆ తర్వాత 12కు చేరింది. బయటకు వచ్చిన డేటా.. ఏదో ఇతర జాబితాకు సంబంధించినదై ఉండొచ్చు. మానవహక్కుల మార్గదర్శకాలన్నింటినీ మేం పాటిస్తాం. ప్రాథమికంగా ఈ వ్యవహారం వెనక పోటీదారుల హస్తం ఉందని అనుకున్నాం. కానీ ఇది అంతర్జాతీయ కుట్ర అని స్పష్టమవుతోంది."

-ఎన్ఎస్ఓ గ్రూప్

ఇదీ చదవండి: Pegasus Spyware: 'పెగాసస్‌' వల పెద్దదే!

ఏంటీ వివాదం

ఇజ్రాయెల్‌లోని ఎన్‌ఎస్‌ఓ గ్రూపునకు చెందిన 'పెగాసస్‌' అనే స్పైవేర్‌ సాయంతో దేశంలోని ప్రముఖులపై హ్యాకింగ్​కు పాల్పడినట్లు 'ది వైర్‌' వార్తాసంస్థ ఓ కథనంలో వెల్లడించింది. వాస్తవానికి ఈ స్పైవేర్‌ ప్రభుత్వాల వద్దే అందుబాటులో ఉంటుంది. నిఘా కార్యకలాపాల కోసం దాన్ని ప్రభుత్వ సంస్థలకు 'ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌' విక్రయిస్తుంటుంది.

'వివరణ ఇవ్వండి'

పెగాసస్ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా.. స్పష్టత ఇవ్వాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రజల్లో భయాలున్నాయని అన్నారు. మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని గుర్తు చేశారు. కానీ ఓ విదేశీ సంస్థ దేశ ప్రజల ఫోన్ కాల్స్ వింటుండటం చాలా తీవ్రమైన అంశమని అన్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ సైతం ట్యాప్​ అయినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు.

'ఆయన వింటున్నారు'

దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు సంధించారు. అందరి ఫోన్లలోని సమాచారాన్ని ఆయన చదివేస్తున్నారని పరోక్షంగా ప్రధానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

rahul gandhi tweet
రాహుల్ ట్వీట్

కాగా ఈ విషయాన్ని పార్లమెంట్​లో లేవనెత్తుతామని కాంగ్రెస్ లోక్​సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి స్పష్టం చేశారు. దేశ భద్రత ప్రమాదంలో పడిందని అన్నారు.

'జేపీసీతో దర్యాప్తు!'

'పెగాసస్' వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ చేయించాలని కాంగ్రెస్ ఎంపీ ప్రదీప్ భట్టాచార్య డిమాండ్ చేశారు. 'పెగాసస్ కథనం విశ్వసనీయతను ఎవరు ధ్రువీకరిస్తారు? దీనిపై దర్యాప్తు జరగాలి. అవసరమైతే జేపీసీ ఏర్పాటు చేసి విచారణ చేయించాలి. దేశ ప్రజాస్వామ్యంపైనే ఫోన్ ట్యాపింగ్​కు పాల్పడ్డారు' అని అన్నారు.

ఇదీ చదవండి: తొలిరోజే దుమారం- లోక్​సభ వాయిదా

Last Updated : Jul 19, 2021, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.