peacocks died in Tamilnadu: పొలంలో రైతు పెట్టిన ఎలుకల మందును తిని 21 నెమళ్లు చనిపోయాయి. ఈ హృదయ విదారకరమైన ఘటన తమిళనాడు తిరుపత్తూర్ సమీపంలోని కురుమ్పత్తిలో జరిగింది.

తన వరి పొలంలో ఎలుకలను నివారించడానికి షణ్ముగం అనే రైతు ఎలుకల మందును పెట్టాడు. పొలంలోకి వచ్చిన నెమళ్లు ఆ ఎలుకల మందును తినేశాయి. దీంతో అవి అక్కడికక్కడే మృతిచెందాయి. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నెమళ్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. రైతు షణ్ముగాన్ని అరెస్ట్ చేసి.. విచారణ చేపట్టారు.


ఇదీ చదవండి: చిరుత మాంసంతో విందు.. చర్మాన్ని విక్రయిస్తూ అడ్డంగా..!