ETV Bharat / bharat

అవినీతితో ఉద్యోగాలు సాధించుకునేందుకేనా తెలంగాణ తెచ్చుకుంది : పవన్‌ కల్యాణ్‌

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2023, 8:16 PM IST

Updated : Nov 26, 2023, 10:42 PM IST

Pawan Kalyan Attend BJP Janasena Meeting in Kukatpally : జనసేన పార్టీ ఆవిర్భావం.. తనకు పునర్జన్మ ఇచ్చిన తెలంగాణలో జరిగిందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో బీజేపీ-జనసేన సభలో పవన్‌ పాల్గొన్నారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు.

Pawan Kalyan Attend BJP Janasena Meeting
Pawan Kalyan Attend BJP Janasena Meeting in Kukatpally

Pawan Kalyan Attend BJP Janasena Meeting in Kukatpally : జనసేన పార్టీ ఆవిర్భావం.. తనకు పునర్జన్మ ఇచ్చిన తెలంగాణలో జరిగిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) అన్నారు. తాను కోరుకున్న స్ఫూర్తినిచ్చిన తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నామని చెప్పారు. ఇక్కడి యువత కోరుకున్నది ఒక్కటే.. రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగ అవకాశాలు వస్తాయని అనుకున్నారన్నారు. తాము సాధించుకున్న తెలంగాణలో అవినీతితో ఉద్యోగాలు సాధించుకునేందుకేనా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నిర్వహించిన బీజేపీ-జనసేన విజయ సంకల్ప సభ(BJP-Congress Sabha)లో పాల్గొని ప్రసంగించారు.

ప్రజలను కలవని సీఎం, సచివాలయానికి రాని సీఎం మనకు అవసరమా? : మోదీ

Telangana Election Polls 2023 : అందుకే నిరుద్యోగులు, యువత కష్టాల్లో తోడుగా ఉంటానని మాటిచ్చారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2023) జనసేనకు మద్దతు తెలిపిన తెలుగుదేశం కార్యకర్తలకు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ సభలో మొదటగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హాజరవుతారనుకుంటే.. ఆఖరి క్షణంలో ఆయన రాకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా(JP Nadda) వచ్చారు.

"ప్రత్యేక తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశపడ్డారు. కానీ వారి ఆశలు నెరవేరలేదు. ఉత్తరాంధ్రకు చెందిన 26 వెనకబడిన కులాలను బీసీ జాబితా నుంచి తీసేశారు. జనసేన కూటమి అధికారంలోకి రాగనే 26 కులాలకు న్యాయం చేస్తాము. ఈ విషయాన్ని కేంద్రంలోని పెద్దల దృష్టికి తీసుకెళ్లాను." - పవన్ కల్యాణ్‌, జనసేన అధినేత

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అవినీతి పార్టీలే : బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ అవినీతి పార్టీలేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ అంటే అవినీతి రాక్షసుల సమితి అనీ, కాంగ్రెస్‌ అంటే కరెప్షన్‌, కమీషన్‌ అని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందన్నారు. అవినీతి ప్రభుత్వాన్ని అంతమొందించాలని జేపీ నడ్డా పిలుపునిచ్చారు.

పోలీసులు, జనసేన శ్రేణులకు మధ్య వాగ్వాదం : బీజేపీ-జసేన సభ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన బారికేట్లను తోసుకుంటూ కార్యకర్తలు ముందుకు దూసుకొచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు లాఠీఛార్జీ చేసి అదుపు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో పోలీసులు, జనసేన శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు కార్యకర్తలు పోలీసులపైకి కుర్చీలను విసిరివేశారు.

అవినీతితో ఉద్యోగాలు సాధించుకునేందుకేనా తెలంగాణ తెచ్చుకుంది పవన్‌ కల్యాణ్‌

Kishan Reddy Meet Pawan Kalyan : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ మద్దతు కోరిన కిషన్‌రెడ్డి

Pawan Kalyan's Janasena Exits From NDA : 'ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తే నేనే చెబుతా'

Last Updated : Nov 26, 2023, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.