Fire Accident In Aeroplane: ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానంలో మొబైల్ నుంచి మంటలు వస్తే? అది తలచుకుంటేనే ఎంతో భయమేస్తుంది. అయితే సరిగ్గా అలాంటి ఘటనే గురువారం జరిగింది. ఇండిగో సంస్థకు చెందిన విమానం (6E 2037) దిబ్రూగఢ్ నుంచి దిల్లీకి వెళ్తుండగా.. అందులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి చెందిన మొబైల్ ఫోన్ నుంచి ఉన్నట్టుండి మంటలు లేచాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. అగ్నిమాపక యంత్రం సాయంతో మంటలను ఆర్పివేయడం వల్ల ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
విమానం సురక్షితంగా గమ్యస్థానం చేరిందనీ, ఎవరికీ గాయాలు కాలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు గురువారం వివరించారు. మొబైల్ ఫోన్ బ్యాటరీ వేడెక్కడం వల్లే ఈ ఘటన జరిగిందని ఇండిగో సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ప్రమాదకర ఘటనల నుంచి కాపాడడానికి సిబ్బంది శిక్షణ పొందడం వల్ల ఈ పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: