గోప్యత విధానంలో వాట్సప్ ప్రతిపాదించిన మార్పులపై గురువారం పార్లమెంటరీ స్థాయీసంఘం సంబంధిత వర్గాల వద్ద అభ్యంతరాలు లేవనెత్తింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన పార్లమెంటరీ స్థాయీసంఘం ఎదుట వాట్సప్ ప్రతినిధులు హాజరై తాము చేపట్టబోయే మార్పులను వివరించారు. మరింత పారదర్శకత తెచ్చేందుకే ఈ మార్పులకు ప్రతిపాదించినట్లు తెలిపారు.
ఫేస్బుక్, ట్విట్టర్, ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో పార్లమెంటరీ స్థాయీసంఘం వేర్వేరుగా చర్చించింది. ఈ సమావేశం అనంతరం వాట్సప్ అధికార ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేస్తూ భవిష్యత్తులోనూ కమిటీకి అన్నివిధాలుగా సహకరిస్తామన్నారు.
రంగంలోకి దిగిన ఫేస్బుక్..
వాట్సప్ వినియోగదారుల్లో భయాలను పోగొట్టేందుకు దీని మాతృసంస్థ ఫేస్బుక్ రంగంలోకి దిగింది. గోప్యత విధానంలో ఫేస్బుక్ ద్వంద్వ ప్రమాణాలపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించింది. రానున్న రోజుల్లో ఫేస్బుక్కు చెందిన కొందరు ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: వైకల్యాన్ని ఎదిరించి వ్యవసాయంలో విజయం