ETV Bharat / bharat

'బంగాల్​లో నిష్పాక్షిక ఎన్నికలు కష్టమే!'

బంగాల్​లో ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా లేవని తృణమూల్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. పోలింగ్​ స్టేషన్లకు వంద మీటర్ల దూరంలోనే రాష్ట్రబలగాలు ఉండాలని ఈసీ నిర్ణయించిందన్న వార్తలను ప్రస్తావిస్తూ... ఎన్నికల సంఘానికి నిరసన తెలిపింది.

TRINAMOOL CONGRESS
ఈసీతో తృణమూల్​ పార్లమెంటరీ నేతల భేటీ
author img

By

Published : Mar 19, 2021, 5:00 PM IST

బంగాల్​లో శాసనసభ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదని ఆరోపించింది తృణమూల్ కాంగ్రెస్. టీఎంసీ ఎంపీల బృందం దిల్లీలో ఈసీ అధికారుల్ని కలిసి.. ఈమేరకు నిరసన తెలిపింది.

"బంగాల్​లో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్రం విషయంలో ఈసీ అవలంబిస్తున్న పక్షపాత వైఖరితోనే ఇది స్పష్టమవుతోంది. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో రాష్ట్ర పోలీసులను అనుమతించరాదని, కేంద్ర బలగాలను మాత్రమే మోహరించాలని ఈసీ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే... చరిత్రలో ఎన్నడూలేని నిర్ణయం అవుతుంది. రాష్ట్ర పోలీసుల ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది. శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్ర పోలీసులకు సహకరించేందుకు మాత్రమే కేంద్ర బలగాలను ఉపయోగించాలి. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో కేంద్ర, రాష్ట్ర బలగాలను మోహరించాలి." అని ఈసీకి సమర్పించిన లేఖలో పేర్కొంది టీఎంసీ.

ఓట్ల లెక్కింపు సమయంలో వంద శాతం వీవీప్యాట్ స్లిప్పు​లను లెక్కించాలన్న డిమాండ్​ను ఈసీ తోసిపుచ్చడంపైనా నిరసన వ్యక్తం చేసింది తృణమూల్ కాంగ్రెస్.

బంగాల్​లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27న తొలి దశ పోలింగ్​ ప్రారంభం కానుంది. మే 2న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

ఇదీ చదవండి: 'మమత రాజకీయాల వల్లే చొరబాట్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.