సీబీఎస్ఈ వ్యవహారాన్ని లోక్‌సభలో ప్రస్తావించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఆమె ప్రసంగానికి స్పందన రాలేదు. ఈ క్రమంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా.. కాంగ్రెస్, పలు ఇతర పార్టీలు దిగువ సభ నుంచి వాకౌట్ చేశాయి.
ఎంపీల సస్పెన్షన్‌పై విపక్షాల వాకౌట్.. రాజ్యసభ వాయిదా - loksabha live news
13:44 December 13
లోక్‌సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్
12:21 December 13
సోనియా గాంధీ డిమాండ్
సీబీఎస్ఈ తాజాగా నిర్వహించిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ఓ వ్యాసం వివాదానికి దారితీసింది. మహిళా సమానత్వాన్ని దెబ్బతీసేలా ఆ వ్యాసం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని లోక్‌సభ వేదికగా ప్రస్తావించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ప్రజలకు సీబీఎస్ఈ వెంటనే క్షమాపణలు చేయాలని డిమాండ్ చేశారు.
12:07 December 13
మళ్లీ వాయిదా..
విపక్షాల నిరసనలతో రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. 12మంది సభ్యుల సస్పెన్షన్‌ను రద్దుచేయాలంటూ విపక్ష సభ్యులు చేసిన వాకౌట్‌తో తొలుత రాజ్యసభ మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా పడింది. 12 గంటలకు తిరిగి ప్రారంభమైనా.. పెద్దగా తేడా లేకుండా పోయింది. చివరికి 2గంటల వరకు మళ్లీ వాయిదా పడింది.
11:32 December 13
విపక్షాల వాకౌట్.. రాజ్యసభ వాయిదా
రెండు రోజుల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన రాజ్యసభలో విపక్షాల నిరసనలు కొనసాగాయి. 12మంది ఎంపీల సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వ వైఖరి వల్లే తాము ఆందోళనలు చేస్తున్నట్టు, ఇప్పడు కూడా సభ నుంచి వాకౌట్ చేస్తామని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే తెలిపారు. విపక్షాల వాకౌట్ చేసిన కొద్దిసేపటికి.. రాజ్యసభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది.
అటు లోక్‌సభలో ప్రశాంతంగా చర్చలు జరుగుతున్నాయి.
అంతకుముందు.. భారత పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడికి 20 ఏళ్లు అయిన నేపథ్యంలో అప్పటి ఘటనలో మరణించిన భద్రతా సిబ్బందిని స్మరించుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్. పార్లమెంట్ ఆవరణలో అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు.