ETV Bharat / bharat

Parliament Special Session 2023 : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సర్వం సిద్ధం.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు విపక్షాల పట్టు

Parliament Special Session 2023 : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సోమవారం నుంచి జరగనున్న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఆసక్తి రేపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం.. అనూహ్య నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన అఖిలపక్ష భేటీలో మహిళా రిజర్వేషన్​ బిల్లుపై విపక్షాలు పట్టుబట్టాయి. ఈ సమావేశాల్లోనే పార్లమెంట్‌ కార్యకలాపాలు పాత భవనం నుంచి కొత్త భవనంలోకి మారనున్నాయని ఎన్​సీపీ నేత ప్రఫుల్​ పటేల్​ తెలిపారు.

Parliament Special Session 2023
Parliament Special Session 2023
author img

By PTI

Published : Sep 17, 2023, 7:08 PM IST

Updated : Sep 17, 2023, 8:33 PM IST

Parliament Special Session 2023 : సార్వత్రిక సమరానికి ముందు.. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి అయిదు రోజుల పాటు జరగనున్నాయి. పార్లమెంటు 75 ఏళ్ల ప్రయాణంపై.. చర్చే ప్రధాన ఎజెండాగా.. పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహిస్తున్నామని ఎన్​డీఏ ప్రభుత్వం చెబుతున్నా, ఏదైనా ఆశ్చర్యకర నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విపక్షాలు అనుమానిస్తున్నాయి. ఎజెండాలో లేని కొత్త చట్టాలు, ఇతర అంశాలను పార్లమెంటులో ప్రవేశపెట్టే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అందుకే పార్లమెంట్‌లో ఈసారి అనూహ్య అంశాలు జరగవచ్చని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేష్ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల సమయంపై అనుమానం వ్యక్తం చేసిన జైరాం రమేష్‌.. పార్లమెంట్‌ 75 ఏళ్ల ప్రయాణంపై చర్చించేందుకే అయితే నవంబర్‌లో జరిగే శీతాకాల సమావేశాల వరకు వేచి ఉండవచ్చు కదా అని ప్రశ్నించారు. ఈ సెషన్‌ను ప్రత్యేక సమావేశంగా అభివర్ణించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి.. తర్వాత ఇది సాధారణ సెషన్ మాత్రమేనన్నారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం ఈ సెషన్‌లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లు సహా జమిలి ఎన్నికలు, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై.. కేంద్రం ఎలాంటి వైఖరి అవలంబిస్తుందోననే ఉత్కంఠ కొనసాగుతోంది.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై విక్షాల డిమాండ్​..
Womens Reservation Bill 2023 : అయితే.. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లు కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని బీఆర్​ఎస్, బీజేడీ సహా పలు ప్రాంతీయ పార్టీలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో డిమాండ్‌ చేశాయి. మహిళా బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదం పొందేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయనున్నట్లు ఆయా ప్రాంతీయ పార్టీలు పేర్కొన్నాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగం, సామాజిక సంక్షోభం, మణిపుర్ తదితర అంశాలను తమ పార్టీ లేవనెత్తనున్నట్లు.. కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారీ తెలిపారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో అధికార పార్టీ తరఫున లోక్‌సభలో ఉపనాయకుడు రాజ్‌నాథ్‌సింగ్‌, రాజ్యసభలో అధికార పార్టీ నేత పియూష్‌ గోయల్‌, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి పాల్గొన్నారు. కాంగ్రెస్‌ తరఫున అధీర్‌ రంజన్‌ చౌదరీ, జేడీఎస్‌ నుంచి దేవెగౌడ, డీఎమ్​కే కనిమొళి, టీఎంసీ తరఫున డెరెక్‌ ఒబ్రెయిన్‌, తెలుగుదేశం నుంచి రామ్మోహన్‌నాయుడు, వైకాపా తరఫున విజయసాయిరెడ్డి, ఆర్జేడీ, జేడీయూ, ఎస్పీల తరఫున ఆ పార్టీల ఎంపీలు అఖిలపక్ష భేటికి హాజరయ్యారు.

కొత్త పార్లమెంట్​లో సమావేశాలు..
New Parliament Building : మొదటి రోజు సమావేశాలు పాత పార్లమెంట్ భవనంలోనే జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. మరుసటి రోజు (సెప్టెంబర్ 19) పాత పార్లమెంట్‌లో ఫోటో సెషన్ ఉంటుందని.. ఆ తర్వాత 11 గంటలకు.. సెంట్రల్ హాల్‌లో ఫంక్షన్ ఉంటుందని చెప్పారు. అనంతరం కొత్త పార్లమెంట్‌లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయని అన్నారు. సెప్టెంబర్ 20 నుంచి కొత్త భవనంలో సాధారణ ప్రభుత్వ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. విపక్షాలు లేవనెత్తిన మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి అడగ్గా.. ఇలాంటి డిమాండ్​లు ఇంతకుముందు కూడా తీసుకువచ్చారని.. ప్రభుత్వం తమ సొంత ఎజెండాను అనుసరిస్తుందని తెలిపారు. సరైన సమసయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

  • #WATCH | Delhi: Union Parliamentary Affairs Minister Pralhad Joshi says, "On the first day, the session will be held in the Old Parliament House... Next day i.e. on 19th September, there will be a photo session in the Old Parliament, then at 11 am there will be a function in the… pic.twitter.com/xwzJ6gRxN7

    — ANI (@ANI) September 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #WATCH | Delhi: Such a demand (for women's reservation bill) has been raised in meetings earlier also. The government follows its own agenda. The right decision will be taken at the right time: Union Parliamentary Affairs Minister Pralhad Joshi on Women's Reservation Bill pic.twitter.com/I1piwr36ui

Parliament Special Session 2023 : ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు.. అజెండా ఇదే.. కీలక బిల్లులు కూడా..

History of Parliament House of India : 75 ఏళ్ల భారత పార్లమెంటు చరిత్ర.. తగ్గుతున్న యువతరం.. పెరిగిన మహిళా బలం..

Last Updated : Sep 17, 2023, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.