విపక్షాల ఆందోళనలకు అడ్డుకట్ట పడలేదు. దీంతో గురువారం సైతం పార్లమెంట్ సమావేశాలు రసాభాసగా సాగాయి. సభ్యులు ఎంతకీ శాంతించకపోవడం వల్ల లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.
విపక్షాల రగడ- ఉభయసభలు రేపటికి వాయిదా
14:26 July 29
14:17 July 29
విపక్షాల ఆందోళనలు రాజ్యసభలో కొనసాగాయి. పెగాసస్ వ్యవహారంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సభ్యులు భారీ ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభ రేపటికి వాయిదా పడింది.
12:36 July 29
పెగసస్ వ్యవహారంపై విపక్షాలు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటులో తీవ్ర స్థాయిలో నిరసనలు చేపట్టాయి. ఫలితంగా ఉభయసభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి.
12:07 July 29
విపక్షాల ఆందోళనలు లోక్‌సభను కుదిపేస్తున్నాయి. దీంతో సభ రెండోసారి వాయిదా పడింది. దిగువసభ మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి సమావేశం కానుంది.
11:13 July 29
లోక్‌సభ సైతం ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే వాయిదా పడింది. విపక్షాలు ఆందోళన చేపట్టవద్దని స్పీకర్ ఓంబిర్లా కోరినా.. సభ్యులు వినిపించుకోలేదు. దీంతో సభను 11.30కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
సమావేశమైనా...
ఉభయ సభలు ప్రారంభానికి ముందు.. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రహ్లద్ జోషి విపక్ష ఎంపీలను కలిశారు. సభలో బిల్లులను ఆమోదించేందుకు సహకరించాలని సభ్యులను కోరారు. అయితే, పెగాసస్, ద్రవ్యోల్బణం, రైతుల సమస్యలపై చర్చ జరపాల్సిందేనని విపక్ష నేతలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు తొలగిపోలేదు.
11:06 July 29
పార్లమెంట్ లైవ్ అప్డేట్స్
రాజ్యసభ వాయిదా
పార్లమెంట్లో విపక్షాల ఆందోళనలు ఆగడం లేదు. పెగాసస్ సహా పలు అంశాలపై చర్చించాలన్న డిమాండ్‌తో విపక్ష పార్టీల ఎంపీలు.. రాజ్యసభలో బిగ్గరగా నినాదాలు చేశారు. పలువురు వెల్‌లోకి దూసుకొచ్చారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్యనాయుడు.

TAGGED:
RS ADJOURN