ETV Bharat / bharat

పార్లమెంట్​లో సెక్యూరిటీ ఎలా ఉంటుంది?- అంత ఈజీగా లోపలికి వెళ్లొచ్చా! - lok sabha security breach video

Parliament Building Security : భారత్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతాల్లో పార్లమెంటు ఒకటి. సందర్శకులు పార్లమెంటు గ్యాలరీలోకి వెళ్లాలంటే మూడంచల భద్రతను దాటాల్సి ఉంటుంది. అటువంటి పటిష్ఠ భద్రత గల పార్లమెంటులో దుండగులు పొగ గొట్టాలతో అలజడి సృష్టించడం వల్ల భయాందోళనను కలిగించింది. అది కూడా కొన్నేళ్ల క్రితం పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన డిసెంబరు 13తేదీనే జరగడం వల్ల సంచలనంగా మారింది. ఈ ఘటన పార్లమెంట్‌ భద్రతా వ్యవస్థపై సందేహాలు రేకెత్తిస్తోంది. ఇంతకీ పార్లమెంట్‌లో ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది? ఎవరెవర్ని అనుమతిస్తారో చూద్దాం.

Parliament Security System
Parliament Security System
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2023, 10:30 PM IST

Updated : Dec 13, 2023, 10:47 PM IST

Parliament Building Security : పార్లమెంట్‌ దేశ రాజధాని దిల్లీ నడిబొడ్డున ఉన్న నిలువెత్తు ప్రజాస్వామ్య దేవాలయం. దేశంలోని అత్యంత భద్రమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. అలాంటి పార్లమెంట్‌లో బుధవారం జరిగిన ఘటన భద్రతా వైఫల్యాన్ని తేటతెల్లం చేసింది. సరిగ్గా 22 ఏళ్ల క్రితం 2001 డిసెంబరు 13న ఉగ్రవాదులు పార్లమెంట్ ప్రాంగణంలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో యావత్‌ భారతం ఉలిక్కిపడింది. అప్పటి నుంచి పార్లమెంట్‌లో భద్రతను మరింత పటిష్ఠం చేశారు. పార్లమెంట్‌ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ఆంక్షలు విధించారు.

విజిటర్స్ పాస్​ తప్పనిసరి
ప్రస్తుతం ఎంపీలు, సరైన గుర్తింపు కార్డు కలిగిన అధికారులు, జర్నలిస్టులు, టెక్నీషియన్లు, పనివారు మినహా పార్లమెంట్‌లోకి ఎవరికీ అనుమతి లేదు. సందర్శకులు రావాలంటే తప్పనిసరిగా పార్లమెంట్‌ సభ్యుల ద్వారా సెక్యూరిటీ క్లియరెన్స్‌ పొంది విజిటర్స్‌ పాస్‌లు తీసుకోవాలి. సందర్శకుల గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఈ పాస్‌ల జారీ చేస్తారు. వీరి ప్రవర్తనకు పూర్తి బాధ్యత ఆయా పార్లమెంట్‌ సభ్యులదే.

మూడంచెల భద్రతా వ్యవస్థ
పార్లమెంట్‌ భవనం చుట్టూ పటిష్ఠమైన భద్రతా వలయం ఉంటుంది. ఎంపీలు మినహా పార్లమెంట్‌కు వచ్చే సిబ్బంది, విజిటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. సందర్శకులు విజిటర్స్‌ గ్యాలరీకి వెళ్లాలంటే మూడంచెల భద్రతా వ్యవస్థను దాటాలి. తొలుత పార్లమెంట్‌ ప్రాంగణంలోని ప్రవేశ ద్వారం వద్ద, రెండోసారి భవనం వద్ద, చివరగా విజిటర్స్‌ గ్యాలరీ వెళ్లే మార్గంలోని కారిడార్‌లో తనిఖీలు చేస్తారు.

సిబ్బందికి సైతం భద్రతా తనిఖీలు
పార్లమెంట్‌లో పనిచేసే ప్రతి సెక్యూరిటీ గార్డుకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వారు తోటమాలి, స్వీపర్లు సహా పార్లమెంట్‌లో పనిచేసే ప్రతి సిబ్బందిని గుర్తించేలా గుర్తింపు కార్డులను జారీ చేస్తారు. పార్లమెంట్‌లో పనిచేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిత్యం ఐడీకార్డులు ధరించాలి. సమయానుసారం సిబ్బందికి సైతం భద్రతా తనిఖీలు చేస్తారు. అదనంగా మెటల్‌ డిటెక్టర్లు, వాహనాల రాకపోకలను నియంత్రించే రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్‌లు, ఫుల్‌ బాడీ స్కానర్ల వంటి అధునాతన పరికరాలతో పార్లమెంట్‌ పరిసరాల్లో భద్రతను ఏర్పాటు చేస్తారు.

ఇంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను దాటుకుని పార్లమెంటులో దుండగులు పొగ గొట్టాలతో అలజడి సృష్టించడం వల్ల పార్లమెంటు భద్రత ఏర్పాట్లపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

నాలుగేళ్లుగా పరిచయం- పక్కా ప్లాన్​తో రెక్కీ చేసి మరీ దాడి- లోక్​సభ ఘటనలో షాకింగ్ నిజాలు

లోక్​సభలో ఛాంబర్​లోకి దూకిన నిందితులు గుర్తింపు- ఫోన్లు జప్తు, ఉగ్రమూలాలపై ఆరా!

Last Updated : Dec 13, 2023, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.