ETV Bharat / bharat

శనివారం ఉదయం 10 గంటలకే లోక్​సభ కార్యకలాపాలు

parliament-budget-sessions-live-updates
పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు
author img

By

Published : Feb 12, 2021, 9:38 AM IST

Updated : Feb 12, 2021, 5:18 PM IST

17:14 February 12

శనివారం ఉదయం 10 గంటలకే లోక్​సభ కార్యకలపాలు

రాజ్యసభ మార్చి 8కి వాయిదా పడిన అనంతరం.. లోక్​సభ కార్యకలాపాలు శనివారం ఉదయం 10 గంటలకే ప్రారంభం కానున్నాయి. అంతకుముందు ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్​సభ కార్యకలాపాలు జరిగాయి. 

16:52 February 12

తృణమూల్​ ఎంపీ రాజీనామా..

తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ దినేశ్​ త్రివేది ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజ్యసభ వేదికగా ప్రకటించారు.

15:24 February 12

మార్చి 8కి వాయిదా

బడ్జెట్​పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రసంగం అనంతరం.. రాజ్యసభ మార్చి 8కి వాయిదా పడింది.

15:03 February 12

డిజిటల్​ చెల్లింపులు ఎవరి కోసం..?

''2016 ఆగస్టు నుంచి 2020 జనవరి వరకు యూపీఏ ద్వారా జరిగిన డిజిటల్​ చెల్లింపులు 3.6 లక్షల కోట్లు. యూపీఐని ఎవరు వాడుతున్నారు? సంపన్నులా? కాదు మధ్య తరగతివారు, చిన్నవ్యాపారులు కదా. మరి వారెవరు? మరి ప్రభుత్వం యూపీఐని సృష్టించి.. డిజిటల్​ చెల్లింపులను ప్రోత్సహించేది ధనవంతులా కోసమా? తన మిత్రుల కోసమా?''

        - నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థిక మంత్రి

14:49 February 12

అదో అలవాటుగా మారింది..

ప్రభుత్వంపై ఏదో రకంగా ఆరోపణలు చేయడం.. విపక్షాలకు ఓ అలవాటుగా మారిందని విమర్శించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. పేదల కోసం ప్రభుత్వం ఇంత చేస్తున్నా.. కేవలం మిత్రుల కోసమే పనిచేస్తున్నారని తప్పుడు కథనాలు సృషించడం సిగ్గు చేటు అని రాజ్యసభలో అన్నారు నిర్మల. 

14:20 February 12

రాజ్యసభలో బడ్జెట్​పై చర్చలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ సమాధానం ఇస్తున్నారు. ఆమె ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

  • దేశంలో అన్ని వర్గాల వారి అభిప్రాయాలు సేకరించాం
  • 130 కోట్ల మంది ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ రూపొందించాం
  • కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సంస్కరణలు అమలు చేశాం
  • ఆత్మనిర్భర భారత్‌ ప్యాకేజీతో రాష్ట్రాలకు అండగా నిలిచాం
  • లాక్‌డౌన్‌ సమయంలో 4 కోట్ల మందికి నేరుగా ఆర్థికసాయం చేశాం
  • కొన్ని కోట్ల కుటుంబాలకు ఉచిత బియ్యం, గ్యాస్‌ ఇచ్చాం
  • పీఎం ఆవాస్‌ యోజన కింద 1.67 కోట్ల ఇళ్లు నిర్మించి ఇచ్చాం
  • పీఎం గ్రామ్‌సడక్‌ యోజన కింద 2.11 లక్షల కి.మీ. మేర రహదారులు నిర్మించాం
  • 9 కోట్ల మంది రైతులకు పీఎం ఫసల్‌ బీమా యోజన కింద లబ్ధి చేకూరింది
  • ఈ-నామ్‌ కింద 1.69 కోట్ల మంది రైతులకు మేలు కలిగింది
  • ముద్ర యోజన కింద రూ. 27,000 కోట్ల రుణాలు ఇచ్చాం

10:53 February 12

మద్దతు ధర తొలగింపుపై విపక్షాలకు కేంద్రం సవాల్​!

సరికొత్త, బలమైన, స్వయంసమృద్ధ భారత్​ నిర్మాణానికి బడ్జెట్​ ఆశాకిరణంగా కనిపిస్తోందన్నారు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకుర్​. ఆర్థిక, ఉత్పాదక శక్తి కేంద్రంగా మారేందుకు దారి చూపుతుందన్నారు. వ్యవసాయ మండీలు, కనీస మద్దతు ధర తొలగిస్తామని ఎక్కడ రాసి ఉందో చూపాలని కాంగ్రెస్​, విపక్ష నేతలకు సవాల్​ విసిరారు ఠాకుర్​. భారత్​ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.   

10:28 February 12

రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మల్లికార్జున్​ ఖర్గే!

రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న గులాం నబీ ఆజాద్​ ఈనెల 15న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త ప్రతిపక్ష నేత ఎంపికకు సిద్ధమైంది కాంగ్రెస్​. తమ పార్టీ తరఫున సీనియర్​ నేత మల్లికార్జున్​ ఖర్గే పేరును ప్రతిపాదిస్తూ ఛైర్మన్​ వెంకయ్యనాయుడుకు సమర్పించింది. 

10:16 February 12

'రైల్వే వంతెనల తనిఖీకి బలమైన వ్యవస్థ'

దేశంలో 34వేలకుపైగా రైల్వే వంతెనలు వందేళ్లకుపైబడినవి ఉన్నట్లు చెప్పారు రైల్వే శాఖ మంత్రి పీయూష్​ గోయల్​. వర్షాకాలం వచ్చే ముందు, ఆ తర్వాత ఆయా వంతెనలను తనిఖీ చేసేందుకు బలమైన వ్యవస్థ ఉన్నట్లు తెలిపారు. సెన్సార్ల ఏర్పాటు కోసం అధునాతన సాంకేతికతను వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. చివరిసారిగా 2019, మార్చి 22న రైలు ప్రమాదం జరిగి మరణాలు నమోదయ్యాయని, గత 22 నెలలుగా రైలు ప్రమాదంతో ఒక్కరు కూడా చనిపోలేదని ప్రకటించారు.  

09:27 February 12

లైవ్​: పార్లమెంటు సమావేశాలు

2021 బడ్జెట్​పై చర్చలో భాగంగా.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​.. కొద్ది సేపట్లో రాజ్యసభలో ప్రసంగించనున్నారు. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు మంత్రి.  

మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ ఫథకాలను పలు రాష్ట్రాలు అమలు చేయకపోవటంపై చర్చించాలని కోరుతూ రాజ్యసభలో శున్య గంట నోటీసులు ఇచ్చారు భాజపా ఎంపీ దీపక్​ ప్రకాశ్​.  

బిహార్​లో కొవిడ్​-19 పరీక్షల సమాచారాన్ని తారుమారు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై శూన్యగంట నోటీసులు ఇచ్చారు ఆర్జేడీ ఎంపీ మనోజ్​ కుమార్​ ఝా. అలాగే.. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై శూన్యగంట నోటీసులు ఇచ్చారు టీఎంసీ ఎంపీ అభిర్​ రంజన్​ బిస్వాస్​.

Last Updated : Feb 12, 2021, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.