ETV Bharat / bharat

'పరీక్షలను పండగలా జరుపుకోవాలి'.. విద్యార్థులతో మోదీ - PM advises students

Pariskha Pe Charcha: ఐదో విడత పరీక్షా పే చర్చ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. పరీక్షలపై పలు కీలక సూచనలు చేశారు. ఆందోళనకు గురి కాకుండా ఉండాలని, స్నేహితులను అనుకరించకుండా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. పరీక్షలను పండగలా జరుపుకోవాలని సూచించారు.

PM Modi
పరీక్షా పే చర్చ
author img

By

Published : Apr 1, 2022, 12:35 PM IST

Pariskha Pe Charcha: దిల్లీలోని తాలక్​టోరా స్టేడియంలో నిర్వహించిన ఐదో విడత పరీక్షా పే చర్చ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కరోనా కారణంగా సుదీర్ఘకాలం తర్వాత నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చ-2022 కార్యక్రమంలో విద్యార్థులను కలుసుకోవటం తనకు ఎంతో ప్రత్యేకమన్నారు మోదీ. పరీక్షలను ఒక పండగలా జరుపుకోవాలని సూచించారు. అంతకుముందు విద్యార్థులు రూపొందించిన కళాకండాల ప్రదర్శనను తిలకించారు.

Pariskha Pe Charcha
హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రులు

"సమయాభావం వల్ల విద్యార్థుల ప్రశ్నలన్నింటికి ఈ వేదికపై సమాధానం ఇవ్వలేం. వీడియో, ఆడియో, సందేశాలు, టెక్ట్స్​ రూపంలో నమో యాప్​ ద్వారా అందిస్తాను. ఇక్కడ కూర్చున్న వారిలో తొలిసారి పరీక్షలకు హాజరవుతున్నవారెవరూ లేరు. పలుమార్లు పరీక్షలకు హాజరైనందున వాటి గురించి పూర్తి అవగాహన ఉంటుంది. మన జీవితంలో పరీక్షలు ఒక మెట్టు. పరీక్షల సమయంలో ఆందోళనకు గురికాకుండా ఉండాలి. స్నేహితులను అనుకరించకూడదు. నీకు వచ్చింది ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయాలి. మీరంతా పరీక్షలను ఒక పండగలా జరుపుకోవాలి. ఆఫ్​లైన్​లో ఎలా జరిగిందో.. ఆన్​లైన్​లోనూ అదే జరుగుతుంది. ఇక్కడ మీడియం ముఖ్యం కాదు. మాధ్యమంతో సంబంధం లేకుండా, విషయాన్ని లోతుగా పరిశోధిస్తే, అర్థం చేసుకోవటంలో తేడా ఉండదు."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

విద్యార్థులు ఆన్​లైన్​లో చదువుకుంటున్నప్పుడు తాము సమయాన్ని చదువుకోసం కేటాయిస్తున్నామా, సామాజిక మాధ్యమాల్లో గడుపుతున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు మోదీ. ఆన్​లైన్​ విద్య.. జ్ఞానాన్ని పొందే సూత్రంపై ఆధారపడి ఉంటుందని, అయితే.. ఆఫ్​లైన్​ విద్య ఆ జ్ఞానాన్ని కొనసాగిస్తూ ఆచరణలో పెట్టేందుకు ఉపయోగపడుతుందన్నారు. జాతీయ విద్యా విధానం ముసాయిదాను సిద్ధం చేసేందుకు చాలా మంది అందులో పాలుపంచుకున్నారని తెలిపారు. సుమారు 6-7 ఏళ్ల పాటు శోధించి రూపొందించామన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు నిపుణుల సూచనలు తీసుకున్నామని చెప్పారు.

ఇదీ చూడండి: 17 ఏళ్లకే ఆంగ్లేయులకు వణుకు పుట్టించిన 'అనంతుడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.