ETV Bharat / bharat

అనసూయకు 100% మార్కులు- ప్చ్​ తల్లిదండ్రులకే అర్థం కాలే! - Utterprades news

తమ కూతురో, కొడుకో పాస్​ అయితేనే.. తల్లిదండ్రులు ఎంతో హడావుడి చేస్తారు. గొప్పగా చెప్పుకుంటారు. అదే నూటికి 90 శాతం మార్కులు వస్తే.. యావత్ ప్రపంచానికి వినపడేలా దండోరా వేస్తారు. కానీ, ఓ విద్యార్థినికి ఆ అనుభూతి దక్కలేదు. సీబీఎస్​ఈ ఫలితాల్లో నూటికి నూరు శాతం మార్కులు సాధించినా.. తల్లిదండ్రులకు ఆ విజయం విలువ తెలియకపోవటంపై ఆవేదన వ్యక్తం చేసింది ఆమె.

girl who scored 100 pc in class 12
అనసూయకు 100% మార్కులు
author img

By

Published : Aug 1, 2021, 4:58 PM IST

ఇటీవల విడుదలైన సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాల్లో మారుమూల గ్రామానికి చెందిన ఓ నిరుపేద విద్యార్థిని అద్భుత ప్రదర్శన చేసింది. నూటికి నూరు శాతం మార్కులు తెచ్చుకుంది. తమ కూతురు పాస్​ అయ్యిందని సంతోషపడ్డారు తల్లిదండ్రులు. కానీ, తమ కూతురి విజయం ఎంత విలువైనదో తెలుసుకోలేకపోయారని ఆ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది.

ఉత్తర్​ప్రదేశ్​ మహోబా జిల్లా బుందేల్ఖండ్​ ప్రాంతంలోని బదెరా గ్రామానికి చెందిన రతీ బాయ్​, లక్ష్మి ప్రసాద్​ దంపతుల మూడో కూతురు అనసూయ(18). సీబీఎస్​సీ 12వ తరగతిలో 600లకు గానూ 599 (99.8%) మార్కులు తెచ్చుకుంది. ఉత్తమ ప్రదర్శనకు ఇచ్చే 5 మార్కులతో వంద శాతం సాధించింది. పొలిటికల్​ సైన్స్​లో 99 మార్కులు రాగా.. ఇంగ్లీష్​, హిస్టరీ, జియోగ్రఫీ, పెయింటింగ్​, హిందీ సబ్జెక్టుల్లో వందకు వంద మార్కులు సాధించింది. తన కుంటుంబం నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన ఏకైక వ్యక్తి అనసూయే.

"మా తల్లిదండ్రులకు సంతోషమే కానీ, నా ఈ విజయం ఎంత విలువైనదో వారికి తెలియదు. నగరాల్లోని తల్లిదండ్రులకు ఆ విలువ తెలుసు. మా గ్రామంతో పాటు సమీప ప్రాంతాలకు చెందిన కొందరు నా ఫలితాల గురించి తెలుసుకున్నారు. వారందరూ సంతోషపడ్డారు కానీ నా ఫలితం విలువను ఇంకా అర్థం చేసుకోలేకపోయారు. మా నాన్న వ్యవసాయం చూసుకుంటూ కూలీకి వెళ్తారు. అమ్మ గృహిణి. నాకు ముగ్గురు అన్నలు, ఒక తమ్ముడు, ఇద్దరు అక్కలు. అన్నయ్యలు 8వ తరగతి వరకు చదువుకొని ఆపేశారు. కూలీ పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరగా ఉంటున్నారు. అక్కలు అసలు స్కూల్​కే వెళ్లలేదు. కేవలం తమ్ముడే ఈ ఏడాది 12వ తరగతి పరీక్షలు రాయనున్నాడు."

- అనసూయ, విద్యార్థిని

అనసూయ 10వ తరగతిలోనూ 98.2 శాతం మార్కులు తెచ్చుకుంది. అయితే.. 12వ తరగతి ఫలితాల విడుదలకు ముందు భయపడ్డానని, ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పింది. 599 మార్కులు సాధిస్తానని ఊహించలేదని తెలిపింది. చదువుతో పాటు పాఠశాల బాస్కెట్​ బాల్, మ్యూజిక్​ బ్యాండ్​లో సభ్యురాలిగా ఉన్నానని, చిత్రలేఖనం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది అనసూయ.

ఐఏఎస్​ కావటమే లక్ష్యం..

పాఠశాలలో చేరేందుకు తనకు సాయం చేసిన మహోబా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మెహన్​ లాల్​కు కృతజ్ఞతలు తెలిపింది అనసూయ. శివ నాడార్​ ఫౌండేషన్​ సాయంతో 2006లో పాఠశాలలో చేరినట్లు చెప్పింది. తన కుటుంబం కూడా ఎంతో మద్దతుగా నిలిచినట్లు తెలిపింది.

దిల్లీ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చేసేందుకు సిద్ధమవుతున్నానని, ఐఏఎస్​ కావటమే తన లక్ష్యమని తెలిపింది అనసూయ.

ఇదీ చూడండి: సీబీఎస్​ఈ క్లాస్​-12 ఫలితాలు విడుదల​.. బాలికలే టాప్

సీబీఎస్​ఈ ఫలితాల్లో అదరగొట్టిన నటి.. 94 శాతం మార్కులతో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.