గుజరాత్ సాబర్కాంఠాలో దారుణం జరిగింది. అప్పుడే జన్మించిన పసికందును భూమిలో పాతిపెట్టేశారు ఆమె తల్లిదండ్రులు. బాలిక ప్రాణాలతో ఉండగానే ఇలా చేశారు. పొలానికి వెళ్లిన ఓ రైతు బాలిక కదలికను గమనించి బయటకు తీశాడు. అనంతరం చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాడు. బాలిక తల్లిదండ్రులు ఇలా ఎందుకు చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక తండ్రి శైలేష్, తల్లి మంజును అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: గంభోయ్ సమీపంలోని పొలంలో నవజాత శిశువును పాతిపెట్టారు ఆమె తల్లిదండ్రులు. అటుగా వెళ్లిన ఓ రైతు పాప కదలికలను గమనించి బయటకు తీసి.. హిమంత్నగర్లోని సివిల్ ఆసుపత్రికి తరలించాడు. నిందితులు గాంధీనగర్‌కు చెందినవారు. వీరిద్దరూ 15 రోజుల నుంచి గంభోయ్లో ఉంటున్నారు. శిశువు బొడ్డు కూడా ఇంకా కోయలేదు. దీంతో పాప పుట్టిన వెంటనే పాతిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇవీ చదవండి: కల్తీ మద్యానికి 8 మంది బలి.. చూపు కోల్పోయిన 25 మంది