'ఆక్సిజన్ డ్రిల్' పేరుతో 22మంది కొవిడ్ రోగుల మరణాలకు కారణమైందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తర్ప్రదేశ్ ఆగ్రాలోని పరాస్ ఆస్పత్రిని జిల్లా యంత్రాంగం సీజ్ చేసింది. పాలనాధికారి ఆదేశాల మేరకు ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు బంధువులు. అయితే రోగుల తరలింపులో తీవ్ర సమస్యలు ఎదురయ్యాయని బంధువులు తెలిపారు.
"మా బంధువును 15 రోజుల క్రితం ఇక్కడ చేర్పించాం. అతని ఆరోగ్య పరిస్థితి మెరుగవ్వలేదు. రోగిని తరలించేందుకు డిశ్చార్జ్ పత్రంపై సంతకం చేయమన్నారు. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లాలో మాకు తెలియదు. నగరంలోని ఆస్పత్రులన్నీ నిండిపోయాయి."
-లాల్ కుమార్ చౌహాన్, ఓ రోగి బంధువు
మరోవైపు తమ ఆస్పత్రిలో 22 మంది మరణించారన్న వార్తలను పరాస్ హాస్పిటల్ యజమాని డాక్టర్ అరింజయ్ జైన్ ఖండించారు. దర్యాప్తునకు తాను సిద్ధమేనని.. పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. పొరపాటునే 'మాక్ డ్రిల్' అనే పదాన్ని ఉపయోగించినట్లు వివరణ ఇచ్చారు.
ఇవీ చదవండి: ఆసుపత్రి 'ఆక్సిజన్ డ్రిల్'- 22 మంది మృతి?