మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే లక్షాధికారులుగా మారిపోయారు. లీజుకు తీసుకున్న గనిలో వారికి విలువైన 3.21 క్యారెట్ల వజ్రం దొరికింది.
రూ.20 లక్షల వజ్రం..
కొద్దిరోజుల క్రితం.. పురుషోత్తంపుర్‌కు చెందిన గోందా బాయీ అనే గిరిజన మహిళ కట్టెల కోసం పన్నా అడవులకు వెళ్లగా.. ఆమెకు వజ్రం దొరికింది. భర్తతో కలిసి డైమండ్ కార్యాలయానికి వెళ్లగా.. ఆ వజ్రం 4.39 క్యారెట్లు అని అధికారులు తెలిపారు. ఆ వజ్రం ఖరీదు సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ప్రభుత్వ పన్నులు, రాయల్టీ మినహాయించిన తర్వాత మిగతా డబ్బుల్ని మహిళకు అందజేశారు.
బుందేల్ఖండ్ ప్రాంతంలోని పన్నా జిల్లా వజ్రాలకు ప్రసిద్ధి. ఇక్కడ వజ్రాల వెలికితీతకు ప్రభుత్వమే భూముల్ని లీజుకు ఇస్తూ ఉంటుంది. అలా దొరికిన వజ్రాల్ని పన్నాలోని డైమండ్ ఆఫీస్లో జమ చేస్తే.. అధికారులు వాటి నాణ్యతను నిర్ధరించి, వేలం వేస్తారు.
ఇవీ చదవండి : మద్యం కోసం దారుణం.. కన్నతల్లిపై కిరోసిన్ పోసి నిప్పు.. చికిత్స పొందుతూ..