ETV Bharat / bharat

ఆరడుగుల 'బుల్‌'లెట్టు.. ఏటా రూ.25 లక్షల సంపాదన - panipat murrah breed badal

Panipat buffalo badal: హరియాణాలోని పానీపత్​కు చెందిన ఓ దున్నపోతు.. తన యజమానికి ఏటా సగటున రూ.25 లక్షలు సంపాదించి పెడుతోంది. విపరీతమైన డిమాండ్ ఉన్న దీని వీర్యం విక్రయించడం ద్వారా దున్నపోతు యజమాని రూ. లక్షలు ఆర్జిస్తున్నారు.

panipat bull badal
పానీపత్ దున్నపోతు
author img

By

Published : Dec 18, 2021, 12:20 PM IST

Updated : Dec 18, 2021, 7:23 PM IST

దున్నపోతుతో లక్షలు ఆర్జిస్తున్న రైతు

Panipat buffalo badal: రోజూ పచ్చగడ్డి మేయడమే కాకుండా 15 లీటర్ల పాలు గటగటా తాగేస్తుంది. 20 కేజీల క్యారెట్లను కరకరా నమిలేస్తుంది. రోజూ ఉదయం, సాయంత్రం ఆవనూనెతో మర్దన.. వారానికి ఓమారు స్వచ్ఛమైన దేశీ నెయ్యితో విందు. బాగోగులు చూసేందుకు ప్రత్యేకంగా ఇద్దరు సేవకులు.. వెరసి రోజుకు వెయ్యి రూపాయల సగటు ఖర్చు. ఇదీ ఓ దున్నపోతు వైభోగం.

murrah buffalo badal
ఆహారం తింటున్న బాదల్

Murrah buffalo Haryana

హరియాణాలోని పానీపత్‌ సమీప బరోలి గ్రామానికి చెందిన ఆరడుగుల ఈ ముర్రాజాతి దున్న తన యజమాని రవీంద్రకు ఏటా దాదాపు రూ.25 లక్షల సంపాదించి పెడుతోంది. అందుకే ఈ రాచమర్యాదలు. రవీంద్ర దీనికి 'బాదల్‌' అనే ముద్దుపేరు కూడా పెట్టారు. ఈ దున్న వీర్యానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో విపరీతమైన డిమాండు ఉంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే రైతులకు ఈ వీర్యం విక్రయించడం ద్వారా రవీంద్ర రూ.లక్షలు ఆర్జిస్తున్నారు.

murrah buffalo badal
బాదల్ గెలుచుకున్న మెడల్స్, సర్టిఫికేట్స్

అంతేనా! ఇప్పటికే డజను పోటీల్లో 'బాదల్‌' విజయం సాధించింది. ఇటీవల పంజాబ్‌లో జరిగిన ఓ పోటీలో ద్వితీయస్థానంతో రూ.5 లక్షలు గెలిచింది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 18, 2021, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.