Pakistan drone India: పంజాబ్‌లోని ఇండో-పాక్ సరిహద్దు వద్ద మరోమారు డ్రోన్ కలకలం సృష్టించింది. అమృత్‌సర్‌లోని అజ్నాలాలో ఆదివారం రాత్రి ఓ డ్రోన్‌ను బీఓపీ ఓల్డ్ సుందర్గఢ్కి చెందిన 183 బీఎస్ఎఫ్ బెటాలియన్ గుర్తించింది. వెంటనే గాల్లోకి కాల్పులు జరిపింది. దీంతో ఆ డ్రోన్ పాకిస్థాన్‌వైపు తిరిగి వెళ్లిపోయింది. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో భద్రతాదళాలు తనిఖీలు ముమ్మరం చేశాయి.
డ్రోన్లు ఇలా దర్శనమివ్వడం.. వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. గత నెల 30న.. అదే ప్రాంతంలో డ్రోన్ దర్శనమిచ్చింది. ఆ ప్రాంతంలో నాలుగు ప్యాకెట్ల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి:- సరిహద్దులో పాక్ డ్రోన్ సంచారం- బీఎస్ఎఫ్ కాల్పులు