ETV Bharat / bharat

అత్యాధునిక సాంకేతికతతోనే డ్రోనాసురులపై వేట!

author img

By

Published : Jun 29, 2021, 8:41 AM IST

జమ్ముకశ్మీర్​లో వరుస డ్రోన్​ దాడులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో శత్రుమూకలు ప్రయోగించే డ్రోన్​ దాడులను భారత్​ అడ్డుకోలేదా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. భవిష్యత్తులో ఇలాంటి డ్రోన్​ దాడులను అరికట్టాలంటే అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.

drone attack
డ్రోన్​ దాడులు

"డ్రోన్లను ఎదుర్కొనే సాంకేతికత మన దగ్గర లేదు" జమ్ము వాయుసేన స్థావరంపై దాడి అనంతరం ఒక బీఎస్‌ఎఫ్‌ అధికారి చెప్పిన మాట ఇది. ప్రస్తుతం సైనికులు అప్రమత్తంగా ఉండి, తూటాలు ప్రయోగిస్తూ డ్రోన్లను అడ్డుకుంటున్నారు. దీంతో పాక్‌ సరిహద్దుల నుంచి వస్తున్న డ్రోన్లు సులభంగా తప్పించుకుపోతున్నాయి.. ఆదివారం జమ్ము.. వైమానిక స్థావరంపై జరిగిన దాడిలోనూ అదే జరిగింది. దాడికి వచ్చిన రెండు డ్రోన్లు బాంబులు వేసి సులభంగా తప్పించుకున్నాయి. మరి దీనికి మార్గం లేదా అంటే. . ఉందంటున్నారు నిపుణులు.

సాంకేతికతపై దృష్టి..

"కేవలం డ్రోన్లతోనే 100 బిలియన్‌ డాలర్ల సైనిక పరికరాలను ధ్వంసం చేశాం" అని ఆర్మేనియాతో యుద్ధం తర్వాత అజర్‌బైజాన్‌ అధ్యక్షుడు తెలిపారు. దీన్ని బట్టే డ్రోన్ల సత్తా ఏంటో అర్థమవుతుంది. ఆర్మేనియా సంప్రదాయ యుద్ధం చేస్తే.. అజర్‌బైజాన్‌ వ్యూహాత్మక సైనిక ప్రాంతాలపై నిప్పులు కక్కే డ్రోన్లతో విరుచుకుపడి కీలక విజయాలు సాధించింది. ఈ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్‌, ఇజ్రాయెల్‌ సహా చాలా దేశాలు డ్రోన్లను అడ్డుకునే సాంకేతికతపై దృష్టి పెట్టాయి. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ రాకెట్లను నిరోధించడానికి 'ఐరన్‌ డోమ్‌' వ్యవస్థను రూపొందించిన ఇజ్రాయెలీ రక్షణ సంస్థ రఫేల్‌ 'డ్రోన్‌ డోమ్‌' అనే కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇది డ్రోన్లను గుర్తించి.. వాటి కెమెరాలను పనిచేయకుండా చేస్తుంది. శక్తిమంతమైన లేజర్‌ పుంజాలతో కచ్చితంగా డ్రోన్‌ను నేలకూల్చగలదు. రాత్రివేళ కూడా ఇది పనిచేయగలదు.

డ్రోన్‌ హంటర్‌..

అమెరికాకు చెందిన ఫోర్టెమ్‌ టెక్నాలజీ కూడా ఇదే తరహాలో ఇంటర్‌సెప్టర్‌ డ్రోన్‌ను తయారు చేసింది. దీని పేరు డ్రోన్‌ హంటర్‌. ఇది ఒక వల లాంటి పరికరంతో డ్రోన్‌ను బంధించి నేలకు దింపుతుంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రైవేట్‌ సంస్థ డ్రోన్​షీల్డ్‌ .. డ్రోన్ల రేడియో ఫ్రీక్వెన్సీని అడ్డుకొని.. వీడియోకు అంతరాయం కలిగిస్తుంది. ఫలితంగా సదరు డ్రోన్‌ వెంటనే నేలపైకి దిగడమో ఆపరేటర్‌ వద్దకు వెనుదిరగడమో చేస్తుంది.

భారత్‌లో ఇంద్రజాల్‌!

యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని భారత రక్షణ పరిశోధన,అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) తయారు చేసింది. గత ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనలో దీన్ని మోహరించారు. అడే ఏడాది దిల్లీలో ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య వేడుకల్లోనూ ఉపయోగించారు.

ఇది 3 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను గుర్తించి జామ్‌ చేయగలదు. 1- 2.5 కిలోమీటర్ల దూరంలోని లోహ విహంగాలపై లేజర్‌ ఆయుధాన్ని ప్రయోగించగలదు. అయితే దీని పరిధి తక్కువగా ఉంది. ఇటీవల భారత్‌ లోని గ్రీన్‌ రోబోటిక్స్‌ సంస్థ 'ఇంద్రజాల్‌' అనే కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. 1000 నుంచి 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో పనిచేయగల సత్తా ఈ టెక్నాలజీ సొంతమని ఆ సంస్థ చెబుతోంది.

పాకిస్థాన్‌ సరిహద్దు పొడుగునా యాంటీ డ్రోన్‌ వ్యవస్థను నెలకొల్పాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. అయితే ఇంద్రజాల్​తో ఆ ఖర్చును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీన్ని కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్‌ ఆధారంగా రూపొందించారు.

పాక్‌ నుంచే 300 డ్రోన్లు

అధికారిక లెక్కల ప్రకారం..2018లో పాక్‌ నుంచి దాదాపు 300 డ్రోన్లు భారత్‌ భూభాగంలోకి వచ్చాయి. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుందని రక్షణరంగ విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న కాలంలో ఈ డ్రోన్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

నిన్న మొన్నటివరకు వీటిని కేవలం ఆయుధాలు, మాదకద్రవ్యాల సరఫరాకు మాత్రమే ఉపయోగించారు. ఇప్పుడు దాడులకు ఉపయోగిస్తున్న తరుణంలో భారత్‌ యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని వీలైనంత త్వరగా సమకూర్చుకోవాల్సిందే.

ఇదీ చదవండి : డ్రోన్ల దాడిపై విచారణ- ఆర్డీఎక్స్ వాడారా​?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.