ETV Bharat / bharat

భారత్​లోకి పాక్​ గూఢచారి పావురం.. రెక్కలపై సంకేతాలు! - భారత్

Pak Pigeon Caught: పాకిస్థాన్​ సరిహద్దు నుంచి ఓ పావురం భారత్‌లోకి వచ్చింది. దాని రెక్కలపై గణాంకాల రూపంలో గూఢ భాష ఉండటం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. దానిని పోలీస్​ స్టేషన్​లో ఉంచి.. దర్యాప్తు చేస్తున్నారు.

Pak Pigeon Caught
pakistan pigeon spy
author img

By

Published : May 24, 2022, 6:52 AM IST

Pak Pigeon Caught: పాకిస్థాన్​ సరిహద్దు నుంచి అనుమానాస్పద రీతిలో ఓ పావురం రావడం కలకలం సృష్టిస్తోంది. పావురం రెక్కలకు ఆంగ్ల భాషాక్షరాలు సహా గణాంకాల రూపంలో గూఢ భాషను రాసినట్లు అధికారులు గుర్తించారు. సంకేతాలతో కూడిన భాషను నిఘా విభాగం అధికారులు డీకోడ్‌ చేయడానికి శ్రమిస్తున్నారు.

సాధారణంగా పాక్ నుంచి భారత సరిహద్దులకు పావురాలు వస్తుంటాయి. అనుమానాస్పదంగా ఉన్నవాటిని అధికారులు అదుపులోకి తీసుకుంటారు. వాటి రెక్కలపై స్టాంప్​లు, అంకెల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వాటిని డీకోడ్​ చేసి అది గూఢచర్యానికి సంబంధించినది కాదని నిర్ధరించుకున్న తర్వాతే వాటిని విడిచిపెడతారు.

ప్రస్తుతం.. పావురం పోలీస్‌ స్టేషన్​లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవలే సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాక్‌ మహిళకు చేరవేసిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో.. పావురం రెక్కలపై గూఢ భాష రాసి ఉండడం పలు సందేహాలను రేకెత్తిస్తోంది.

ఇదీ చూడండి: 'వలపు వల'లో ఆర్మీ జవాన్​.. పాక్​కు రహస్య సమాచారం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.