భారత్‌లో ఆరోగ్య రంగానికి సంబంధించి తాజా నివేదిక ఒకటి చేదు వాస్తవాలను బయటపెట్టింది! సగటున ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు ఆసుపత్రుల్లో లేదా ఆరోగ్యరంగ నిపుణుల చేతుల్లో కులం, మతం, ఆరోగ్య పరిస్థితి ప్రాతిపదికన వివక్షకు(religious discrimination in hospitals) గురవుతున్నారని తేల్చింది. 'భారత్‌లో రోగుల హక్కుల పరిరక్షణ'(charter of patients rights) పేరుతో ఆక్స్‌ఫామ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ మంగళవారం ఈ నివేదికను విడుదల చేసింది. దేశంలో రోగుల హక్కులకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య 3,890 మంది నుంచి ఆ సంస్థ అభిప్రాయాలు సేకరించింది.
హక్కులు.. అందనిద్రాక్షే..
- ఆసుపత్రుల్లో లేదా ఆరోగ్యరంగ నిపుణుల చేతుల్లో తాము కులం, మతం, వ్యాధి, ఆరోగ్య పరిస్థితి ప్రాతిపదికన వివక్షకు(patients rights in india) గురవుతున్నామని.. సర్వేలో పాల్గొన్నవారిలో మూడోవంతు మంది ముస్లింలు; 20% మందికి పైగా దళితులు, ఆదివాసీలు; మొత్తంగా 30% మంది ఆవేదన(Discrimination in Accessing Healthcare) వ్యక్తం చేశారు.
- గత పదేళ్లలో తమ సమీప బంధువులు ఆసుపత్రిపాలైనప్పుడు- చికిత్స ప్రారంభానికి ముందు అంచనా వ్యయం వివరాలను ఆసుపత్రులు ఎన్నడూ అందించలేదని 50% తెలిపారు.
- తాము కోరినప్పటికీ కేసు పేపర్లు, రోగి రికార్డులు, వివిధ పరీక్షల ఫలితాలను ఎప్పుడూ ఇవ్వలేదని 31% మంది చెప్పారు.
- మహిళలెవరూ లేకుండానే పురుష అటెండెంట్ తమకు భౌతిక పరీక్షలు నిర్వహించారని 35% స్త్రీలు పేర్కొన్నారు.
- తాము ఎలాంటి అనారోగ్యానికి గురయ్యామో, దానికి కారణాలేంటో ఏమాత్రం వివరించకుండానే వైద్యులు ఔషధాలు రాసిచ్చారని, పరీక్షలు చేయించుకోవాలని చెప్పారని 74% తెలిపారు.
- తాము, తమ సమీప బంధువులు ఆసుపత్రుల్లో చేరినప్పుడు.. వైద్య సిబ్బంది ఏమేం పరీక్షలు నిర్వహిస్తున్నారో తమకు చెప్పనేలేదని 57% మంది సమాధానమిచ్చారు.
ఇవీ చదవండి: