ETV Bharat / bharat

UP Election 2022: యూపీ రాజకీయాల్లో 'ఎంఐఎం' గుబులు - అసదుద్దీన్​ ఒవైసీ వార్తలు తాజా

ఎంఐఎం రంగ ప్రవేశంతో యూపీ రాజకీయ పరిస్థితులు (AIMIM UP Election) మారాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారన్నది (UP Election 2022) ఆసక్తికరంగా మారింది. తమకు రావాల్సిన ఓట్లకు గండి పడుతుందని ప్రతిపక్షాలు భయపడుతున్నాయి.

AIMIM UP election
యూపీలో ఎంఐఎం గుబులు
author img

By

Published : Sep 27, 2021, 7:52 AM IST

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో (UP Election 2022) ముస్లిం ఓటర్లు ఈసారి ఎటువైపు మొగ్గుచూపుతారన్నది అసక్తికరంగా మారింది. ఇంతవరకు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లకు వారు ఓటేస్తుండగా ఎంఐఎం (AIMIM UP Election) రంగ ప్రవేశంతో పరిస్థితులు మారాయి. తక్కువ సంఖ్యలో ఉన్న జాతవ్‌, యాదవ్‌, రాజ్‌భర్‌, నిషాద్‌ కులాల వారికి ప్రత్యేకంగా పార్టీలు, నాయకులు అంటూ ఉండగా 19 శాతం మేర ఉన్న ముస్లింలకు ఏకీకృత నాయకత్వం లేకపోవడాన్ని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ (Asaduddin Owaisi UP Election) ప్రస్తావిస్తున్నారు. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లు ముస్లింలను ఓటు బ్యాంకులుగా మార్చుకొని బానిసలుగా చూస్తున్నాయని అంటున్నారు. దీనికి విముక్తి కలిగించి సమర్థ నాయకత్వం ఇవ్వడమే తమ లక్ష్యమని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 408 స్థానాలు ఉండగా అందులో 82 చోట్ల ముస్లింల ప్రభావం అధికంగా ఉంది. అందువల్ల 100 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని ఎంఐఎం భావిస్తోంది.

'ఓట్​ ఖత్వా'

బిహార్‌లోని సీమాంచల్‌ ప్రాంతంలో ముస్లింల మెజార్టీ (Muslim Vote in UP) అధికంగా ఉండటం వల్ల అక్కడ అభ్యర్థులను నిలబెట్టి (AIMIM UP Election) అయిదు సీట్లను పొందింది. అదే సూత్రాన్ని ఇక్కడా అమలు చేయాలని అనుకుంటోంది. దీనివల్ల భాజపాకు ఎలాంటి నష్టం లేకపోయినా, మిగిలిన మూడు పార్టీలు మాత్రం ఇబ్బంది పడుతున్నాయి. తమకు రావాల్సిన ఓట్లకు గండి పడుతుందని భయపడుతున్నాయి. అందుకే ఒవైసీని (Owaisi UP News) 'ఓట్​ ఖత్వా' (ఓట్లను చీల్చే వ్యక్తి) అని సమాజ్​వాదీ పార్టీ సీనియర్​ నాయకుడు అబు అజ్మీ విమర్శించారు. ముస్లిం ఓట్లు తమకు రాకుండా చేయడానికే భాజపా తరపున ఆయన పోటీ చేస్తున్నారని విమర్శించారు. ముస్లిం ఓట్లు తమకు రాకుండా చేయడానికే భాజపా తరఫున ఆయన పోటీ చేస్తున్నారని విమర్శించారు.

'ఎన్నికలప్పుడే ముస్లింలు గుర్తుకువస్తారు'

కాంగ్రెస్​ నాయకుడు లల్లన్‌ కుమార్‌ కూడా దాదాపుగా ఇలాంటి వ్యాఖ్యే చేశారు. ఎన్నికలప్పుడే ఒవైసీకి (Asaduddin Owaisi UP Election) ముస్లింలు గుర్తుకువస్తారని విమర్శించారు. సంప్రదాయంగా ముస్లింలంతా కాంగ్రెస్‌ మద్దతుదారులేనని అన్నారు. ఎంఐఎం జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్‌ వసీం వకార్‌ మాత్రం తమ పార్టీ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఇతర పార్టీలేవీ ముస్లిం నాయకత్వాన్ని ఎదగనీయడం లేదని, అందుకే ప్రత్యేకంగా పోటీ చేస్తున్నట్టు చెప్పారు. దేశంలో హిందుత్వ రాజకీయాలు పెరుగుతున్న దృష్ట్యా ముస్లింలు కూడా తమకంటూ నాయకులు ఉండాలని భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆ నేపథ్యంలో ఎన్నికలపై ఎంఐఎం ప్రభావం తప్పకుండా ఉంటుందని పర్వేజ్‌ అహ్మద్‌ అనే విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు. అయితే ముస్లింలకు సొంత నాయకత్వం ఉండాలన్నది కొత్తగా వచ్చిన అంశమేమీ కాదని మరో విశ్లేషకుడు రషీద్‌ కిద్వాయ్‌ చెప్పారు. ప్రతి ఎన్నికల్లోనూ ఇది ప్రస్తావనకు వస్తూనే ఉందని గుర్తు చేశారు. వారెప్పుడూ ఎస్పీ, బీఎస్సీలకే ఓటు వేస్తున్నారని అన్నారు. 'భాగదారీ మోర్చా' పేరుతో ఎంఐఎం... సుహల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవడం గమనార్హం.

ఇదీ చూడండి : యూపీలో కేబినెట్ విస్తరణ- జితిన్ ప్రసాదకు స్థానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.