ETV Bharat / bharat

దశాబ్దాలుగా నిర్మాణ దశలోనే 888 రహదారి ప్రాజెక్టులు! - రోడ్డు నిర్మాణాల్లో జాప్యం

దేశవ్యాప్తంగా 888కి పైగా రహదారి ప్రాజెక్టులు దశాబ్దాలుగా నిర్మాణ దశలోనే ఉన్నట్లు పార్లమెంటరీ కమిటీ నివేదించింది. కొత్త ప్రాజెక్టులు ప్రకటించే బదులు ఇప్పటికే మంజూరు అయినవాటిని పూర్తి చేయటంపై దృష్టి సారించాలని జాతీయ రోడ్డు రవాణా, రహదారుల శాఖకు సూచించింది.

Over 888 road projects running late; many projects incomplete even after a decade
'888కి పైగా రహదారి ప్రాజెక్టులు.. దశాబ్దాలుగా జాప్యం'
author img

By

Published : Mar 24, 2021, 5:09 PM IST

దేశవ్యాప్తంగా 888కిపైగా రహదారుల ప్రాజెక్టులు దశాబ్దాలుగా నిర్మాణ దశలోనే ఉన్నట్లు జాతీయ రోడ్డు రవాణా, రహదారుల శాఖకు పార్లమెంటరీ కమిటీ నివేదించింది. కొత్త ప్రాజెక్టులు ప్రకటించే బదులు.. నిర్మాణ దశలో ఉన్న రహదారులను పూర్తి చేయాలని సూచించింది.

కేంద్రం లెక్కల ప్రకారం..

జాతీయ రోడ్డు రవాణా, రహదారుల శాఖ లెక్కల ప్రకారం.. దేశవ్యాప్తంగా 62,15,797 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గం విస్తరించి ఉంది. వీటిలో 1,36,000 కిలోమీటర్లు జాతీయ రహదారులు. భారత్​లో ఇప్పటికీ చాలా ప్రాంతాలకు రోడ్డు మార్గం లేదు. నిర్దేశించిన సమయంలో రోడ్డు నిర్మాణం పూర్తికాకపోవటం ప్రధాన సమస్యగా ఉంది. చాలా చోట్ల నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి.

888 ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే

పార్లమెంటరీ కమిటీ అందించిన సమాచారం ప్రకారం.. 2020-21 నాటికి 888 రహదారి ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కింద రూ. 3,15,373.30 కోట్ల వ్యయంతో 27,665.3 కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరుగుతోంది. దమన్​ దీవ్​, డయ్యూ మినహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణ పనులు ఆలస్యంగానే జరుగుతున్నాయి. జాప్యం కారణంగా ప్రజల సమయం, డబ్బు వృథా అవుతోంది. అంతేకాక రోజురోజుకూ ప్రాజెక్టు​ వ్యయం సైతం పెరుగుతోందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రాజెక్టులు- సవాళ్లు

నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి సవాల్​గా మారాయి. వీటిపై దృష్టి సారించి త్వరగా పూర్తి చేయాలని కమిటీ సిఫార్సులు చేసింది. రోడ్డు నిర్మాణ రంగానికి అధిక నిధులు కేటాయించాలని సలహా ఇచ్చింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్​హెచ్​ఏఐ) వ్యయం పెరుగుతున్నా.. ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు తగ్గటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ రంగంలో ప్రైవేట్​ పెట్టుబడులు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సంవత్సరాలుగా జాప్యం

దేశంలోని కొన్ని ప్రాజెక్టులు దశాబ్దాలైనా నిర్మాణంలో నత్తనడకన సాగుతున్నాయి. ఇలాంటి ప్రాజెక్టులు ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. పార్లమెంటరీ కమిటీ ప్రకారం దేశవ్యాప్తంగా 70 ప్రాజెక్టులు ఐదు సంవత్సరాలకు పైగా నిర్మాణ దశలోనే ఉన్నాయి.

  • నల్బరీ - బిజ్​నీ(అసోం) ప్రాజెక్టు

12 సంవత్సరాల క్రితం పూర్తికావాల్సిన అసోంలోని నల్బరీ - బిజ్​నీ(అసోం) ప్రాజెక్టు ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. 27.3 కిలోమీటర్లు ఉన్న ఈ మార్గం అసలు బడ్జెట్ కేటాయింపు రూ. 208కోట్లు. కాగా ప్రస్తుత వ్యయం రూ. 230 కోట్లు దాటింది.

  • నాగ్​పుర్​- కొందాలి(మహారాష్ట్ర) రహదారి ప్రాజెక్టు

40 కిలోమీటర్లు ఉన్న రోడ్డు నిర్మాణం.. 12 సంవత్సరాల క్రితం పూర్తి కావాల్సింది. కానీ ఇంకా నిర్మాణ దశలోనే ఉంది.

  • తిరుచీ-కరూర్​(తమిళనాడు) రహదారి ప్రాజెక్టు

80 కిలోమీటర్ల రోడ్డు మార్గం.. పదేళ్లయినా ఇంకా పూర్తి కాలేదు. వ్యయం- రూ. 571 కోట్లు

  • దిల్లీ సరిహద్దు -రోహ్​తక్(హరియాణా)

పదేళక్రితం పూర్తికావాల్సింది. ప్రస్తుతం నిర్మాణ దశలోనే ఉంది.

అధికార గణాంకాల ప్రకారం ఛత్తీస్​గఢ్​లో దాదాపు 17 రోడ్డు ప్రాజెక్టుల నిర్మాణ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. ఈ 17 ప్రాజెక్టులు ఐదు నుంచి పదేళ్ల క్రితం పూర్తికావాల్సినవి.

ఇదీ చదంవండి : కరోనా పంజా: భారత్​లో మరో కొత్త వేరియంట్​​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.