ETV Bharat / bharat

'రాష్ట్రాల వద్ద ఇంకా 79 లక్షల టీకాలు' - రాష్రాలకు కేంద్రం పంపిన టీకా డోసులు

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 79 లక్షలకు పైగా కొవిడ్-19 వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. వచ్చే మూడు రోజుల్లో 17 లక్షలకు పైగా డోసులు సరఫరా చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.

Over 79 lakh COVID-19 vaccine doses available with states/UTs: Centre
'79 లక్షలకు పైగా టీకా డోసులు అందించాం'
author img

By

Published : May 1, 2021, 2:44 PM IST

ఇప్పటివరకు 16.37 కోట్ల వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/యుటీలకు ఉచితంగా అందించినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. వీటిలో.. 15,58,48,782 డోసులు(పనికిరాకుండా పోయిన వాటితో కలిపి) వినియోగించినట్లు తెలిపింది. 79,13,518 కంటే ఎక్కువ వ్యాక్సిన్​లు ఇప్పటికీ రాష్ట్రాలు/యుటీల వద్ద ఉన్నట్లు వెల్లడించింది. రాబోయే 3 రోజుల్లో 17,31,110కు పైగా వ్యాక్సిన్​లను పంపనున్నట్లు ప్రకటించింది.

రాష్ట్రాల వారీగా అందిన డోసులు..

  • మహారాష్ట్ర: కొవిషీల్డ్- 17,50,620, కొవాగ్జిన్-5,76,890
  • దిల్లీ: కొవిషీల్డ్- 3,73,760, కొవాగ్జిన్- 1,23,170
  • ఛత్తీస్‌గఢ్​: కొవిషీల్డ్- 6,47,300, కొవాగ్జిన్-2,13,300
  • బంగాల్‌: కొవిషీల్డ్- 9,95,300, కొవాగ్జిన్-3,27,980
  • ఉత్తర్​ప్రదేశ్‌: కొవిషీల్డ్- 13,49,850, కొవాగ్జిన్- 4,11,870
  • రాజస్థాన్: కొవిషీల్డ్- 12,92,460, కొవాగ్జిన్-4,42,390
  • కేరళ: కొవిషీల్డ్- 6,84,070, కొవాగ్జిన్-2,25,430
  • పంజాబ్: కొవిషీల్డ్-4,63,710, కొవాగ్జిన్-1,52,810
  • గుజరాత్‌: కొవిషీల్డ్-12,48,700, కొవాగ్జిన్-4,11,490

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో టీకా కూడా ఒక భాగమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. టీకాలు, పరీక్షలు, ట్రాకింగ్, చికిత్స, నిబంధనల పాటించడం వంటివి మహమ్మారిపై పోరాడేందుకు ప్రభుత్వం ఎంచుకున్న ఐదు పాయింట్ల వ్యూహంలో అంతర్భాగమని తెలిపింది.

ఇవీ చదవండి: నేటి నుంచే '18 ప్లస్'​కు టీకా.. కొన్ని రాష్ట్రాల్లోనే!

'జులై నెలాఖరు వరకు టీకా కొరత సమస్య'

రోడ్డు పక్కన 2 లక్షల కరోనా టీకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.