బిహార్, బంగాల్, త్రిపుర రాష్ట్రాల్లోనే అత్యధిక సంఖ్యలో బాల్యవివాహాలు జరుగుతున్నాయి. 18 ఏళ్లు నిండకముందే ఆ రాష్ట్రాల్లోని 40 శాతం మంది బాలికలకు పెళ్లిళ్లు జరుగుతున్నాయి. 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్) చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. జనాభా, ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ మరియు పోషణ సంబంధిత సూచికలపై సమాచారాన్ని సేకరించడానికి 6.1 లక్షల కుటుంబాలపై ఈ సర్వే నిర్వహించింది ఎన్ఎఫ్హెచ్ఎస్.
20-24 ఏళ్ల మధ్య వయసున్న మహిళలపై సర్వే నిర్వహించింది.
సర్వేలోని ముఖ్యాంశాలు..
18 ఏళ్లు నిండకముందే వివాహం జరుగుతున్న మహిళల శాతం..
- బిహార్- 40.8
- త్రిపుర-40.1
- బంగాల్-41.6
- అసోం- 31.8
- ఆంధ్రప్రదేశ్- 29.3
- గుజరాత్- 21.8
- కర్ణాటక -21.3
- మహారాష్ట్ర- 21.9
- దాద్రానగర్&హవేలీ, దమన్ దీవ్ -26.4
15 -19 ఏళ్ల వయస్సులోనే తల్లులుగా మారుతున్న మహిళల శాతం..
- ఆంధ్రప్రదేశ్-12.6
- అసోం- 11.7
- బిహార్- 11
- త్రిపుర- 21.9
- బంగాల్- 16.4
మహిళలతో పోలిస్తే అధికారిక వయస్సు(21 సంవత్సరాలు) రాకముందే వివాహాలు జరుగుతున్న పురుషుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు సర్వేలో తేలింది.
21 ఏళ్లు నిండకముందే వివాహం జరుగుతున్న పురుషుల శాతం
- అసోం-21.8
- బిహార్-30.5
- గుజరాత్-27.7
- త్రిపుర- 20.4
- బంగాల్- 20
- లద్దాఖ్-20.2
ఇదీ చూడండి:కరోనా వేళ దేశంలో పెరిగిన గృహహింస