దేశంలో 3.86కోట్ల మందికి పైగా నిర్ణీత సమయంలోగా రెండో డోసు కరోనా టీకా తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రమణ్ శర్మ అనే కార్యకర్త.. ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చింది. నిర్ణీత సమయంలో కొవిషీల్డ్ రెండో డోసు తీసుకోనివారు 3,40,72,993 మంది ఉండగా, కొవాగ్జిన్ రెండో డోసు వేయించుకోనివారు 46,78,406 మంది ఉన్నట్లు తెలిపింది.
కాగా, కొవిన్ పోర్టల్లోని సమాచారం ప్రకారం గురువారం మధ్యాహ్నాం నాటికి 44,22,85,854 మంది తొలి డోసు, 12,59,07,443 మంది రెండో డోసు వేయించుకున్నారు. ఇక కొవిషీల్డ్ తీసుకున్న 84-112 రోజుల తర్వాత, కొవాగ్జిన్ వేయించుకున్న 28-42 రోజుల అనంతరం రెండో డోసు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచిస్తోంది.
తొలి డోసు తీసుకున్న నిర్ణీయ సమయంలోగా రెండో డోసు తీసుకోవాలని సిఫార్సు చేసింది కేంద్రం. రెండు డోసులు ఒకే టీకాకు చెందినవై ఉండాలని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: Vaccine Trials: 2-6ఏళ్ల వారికి రెండో డోసు ట్రయల్స్!