ETV Bharat / bharat

'20 రోజుల్లో 13 వేల మంది గూండాలు అరెస్టు' - గూండాల అరెస్టు

Goondas arrested in Kerala: సంఘ విద్రోహక శక్తులపై ఉక్కుపాదం మోపారు కేరళ పోలీసులు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 20 రోజుల వ్యవధిలో 13వేల మంది గూండాలను ఖైదు చేశారు.

kerala crime news
crime news
author img

By

Published : Jan 12, 2022, 6:06 AM IST

Goondas arrested in Kerala: సుమారు 20 రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా 13వేల మంది గూండాలను అరెస్టు చేశారు కేరళ పోలీసులు. గతేడాది డిసెంబర్ 18 నుంచి ఈ ఏడాది జనవరి 9 వరకు ఈ అరెస్టులు జరిగాయి. సంఘ విద్రోహక శక్తుల అణచివేతలో భాగంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నారు పోలీసులు.

2021 డిసెంబర్ ఆరంభంలో అలప్పుజలో ఎస్​డీపీఐ సహా ఓ భాజపా నేత గంటల వ్యవధిలో హతమయ్యారు. దాంతోపాటు కేరళ వ్యాప్తంగా పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే గూండాలపై ఉక్కుపాదం మోపారు పోలీసులు.

రాష్ట్రవ్యాప్తంగా 16,680 ప్రాంతాల్లో 13,032 మంది గూండాలను పోలీసులు అరెస్టు చేశారు. 5987 మొబైల్​ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక కేరళ యాంటీ సోషల్ యాక్టివిటీస్​ (ప్రివెన్షన్​) యాక్ట్ కింద 215 మందిపై కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: 12 గంటల వ్యవధిలో ఇద్దరు రాజకీయ నేతల హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.