విపక్షాలపై అమిత్ షా ఫైర్
అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో మాట్లాడుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. విపక్షాలపై విమర్శలు గుప్పించారు. గాంధీ క్విట్ ఇండియా నినాదం మాదిరిగానే.. అవినీతి, కుటుంబ పాలన రాజకీయాలకు వ్యతిరేకంగా మోదీ నినాదం ఇచ్చారని అన్నారు.
- ఆగస్ట్ 9నే గతంలో గాంధీ క్విట్ ఇండియా పిలుపు ఇచ్చారు
- అవినీతి, కుటుంబపాలన రాజకీయాలకు మోదీ భరతవాక్యం పలికారు
- గతంలో పీవీ ప్రభుత్వం ఎంపీల కొనుగోలు ద్వారా అవిశ్వాసం నెగ్గింది
- ఎంపీల కొనుగోలు కేసులో చాలామంది జైలుకు కూడా వెళ్లారు
- నిజాయితీతో అవిశ్వాసాన్ని ఎదుర్కొని వాజ్‌పేయీ ఒక్క ఓటు తేడాతో ప్రధాని పదవి నుంచి దిగిపోయారు
- వాజ్‌పేయీ తలచుకుంటే అప్పట్లో అవిశ్వాసాన్ని సులభంగా నెగ్గేవారు
- ఒడిశా సీఎంగా ప్రమాణం చేసిన ఒక ఎంపీ ఓటుతో వాజ్‌పేయీ పదవి కోల్పోయారు
- నిజాయితీ, నిబద్ధతతో నిలిచినందుకే వాజ్‌పేయీ మళ్లీ ప్రధాని అయ్యారు
- ఇది ట్రైలర్ మాత్రమే.. మొత్తం వినేందుకు విపక్ష ఎంపీలకు ధైర్యం ఉండాలి
- స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్నో అవిశ్వాస, విశ్వాస తీర్మానాలు చర్చకు వచ్చాయి
- కానీ.. విపక్షాలు తమపై విశ్వాసం కోసం అవిశ్వాసం పెట్టడం ఇదే తొలిసారి
- ఈ ప్రభుత్వంపై ప్రజలకు, ఎంపీలకు పూర్తి విశ్వాసం ఉంది
- ఈ అవిశ్వాస తీర్మానం ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించట్లేదు
- స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అత్యధిక ప్రజాదరణ కలిగిన ప్రధాని మోదీయే
- ప్రధాని మోదీ జనాదరణ గురించి అనేక అంతర్జాతీయ సంస్థల సర్వేలు ఇప్పటికే చెప్పాయి