ETV Bharat / bharat

ప్రతిపక్షాల కూటమి పేరు 'INDIA'.. ముంబయిలో నెక్స్ట్ భేటీ.. 11 మందితో కమిటీ

Opposition Meeting In Bengaluru : కేంద్రంలో అధికార NDAని దీటుగా ఎదుర్కొనేందుకు ఏకమైన విపక్షాలు.. తమ కూటమికి ఇండియాగా నామకరణం చేశారు. ఇండియా అంటే ఇండియన్ నేషనల్ డెవెలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్‌గా పేర్కొన్న నేతలు.. 2024 ఎన్నికల్లో ఇండియా, ఎన్​డీఏ మధ్యే జరుగుతాయని తెలిపారు. ఇండియావైపు నిలబడేవారు.. తప్పక విజయం సాధిస్తారని బెంగళూరులో రెండురోజుల చర్చలు 26 పార్టీల ముఖ్యనేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో విభేదాల్ని పక్కనబెట్టి ముందుకుసాగుతామని ప్రకటించిన నేతలు.. 2024 ఎన్నికల్లో బీజేపీని ఐక్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తామన్నారు.

opposition meeting bengaluru
opposition meeting bengaluru
author img

By

Published : Jul 18, 2023, 5:24 PM IST

Updated : Jul 18, 2023, 6:24 PM IST

Opposition Meeting In Bengaluru : సార్వత్రిక సమరానికి సమయాత్తమవుతున్న విపక్ష నేతలు.. బెంగళూరు వేదికగా రెండు రోజులపాటు విస్త్రతస్థాయిలో చర్చలు జరిపారు. ఈ భేటీలో.. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సహా దిల్లీ, పంజాబ్, బిహార్, ఝార్ఖండ్, బంగాల్, తమిళనాడు సీఎంలు పాల్గొన్నారు. ఎన్​సీపీ చీఫ్ శరద్ పవార్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఎస్​పీ అధినేత అఖిలేశ్ యాదవ్​, ఆర్​జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్ హాజరయ్యారు. సోమవారం సమావేశంలో ఉమ్మడి ప్రణాళిక రూపకల్పన, సంయుక్త ఆందోళనల నిర్వహణ లక్ష్యంగా సమాలోచనలు జరిపిన నేతలు.. మంగళవారం కూటమి పేరు ఖరారు చేశారు. ఇండియన్ నేషనల్ డెవెలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్‌గా.. కూటమికి నామకరణం చేశారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించారు. తక్షణమే కులాల ఆధారంగా జనగణన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ తీర్మానం చేశారు.

విద్వేషాలను రెచ్చగొడుతూ, మైనార్టీలపై దాడులకు పాల్పడేవారిని, మహిళలు, దళితులు, గిరిజనులు, కశ్మీరీ పండిట్లపై హింసకు పాల్పడుతున్న వారిని ఓడించడమే.. తమ లక్ష్యమని తీర్మానించారు. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా.. దేశ మూల సిద్ధాంతాన్ని పరిరక్షించాలని సంయుక్త తీర్మానంలో ప్రముఖంగా పేర్కొన్నారు. గణతంత్ర భారతావనిపై బీజేపీ ఒక క్రమపద్ధతిలో దాడులు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసిన విపక్షాలు.. దేశ చరిత్ర కీలక మలుపు ముంగిట ఉందని పేర్కొన్నాయి. అధికార పార్టీని వ్యతిరేకించే వారిపై బీజేపీ విషప్రచారం చేస్తూ.. దారుణంగా దాడులకు పాల్పడుతోందని తీర్మానంలో విపక్ష నేతలు ధ్వజమెత్తారు. అందుకే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రత్యామ్నాయ అజెండాను.. ప్రజల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు వివరించారు. సమావేశం అనంతరం నేతలంతా కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు.

Opposition Unity Meeting in Bengaluru : విపక్షాల కూటమికి INDIA (ఇండియన్ నేషనల్​ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయెన్స్‌)గా పేరు పెట్టామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. విపక్షాల తర్వాత సమావేశం ముంబయిలో నిర్వహిస్తామని.. తేదీని త్వరలో వెల్లడిస్తామని ఖర్గే చెప్పారు. 11 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని.. కమిటీ సభ్యుల పేర్లను ముంబయిలో ప్రకటిస్తామని తెలిపారు.

  • #WATCH | NDA is holding a meeting with 30 parties. I have not heard about so many parties in India. Earlier they didn't hold any meetings but now they are meeting one by one (with NDA parties) PM Modi is now afraid of opposition parties. We have gathered here to save democracy… pic.twitter.com/LGDB8wLg9v

    — ANI (@ANI) July 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Opposition Alliance Name India : ఎన్​డీఏ సమావేశానికి 30 పార్టీలు వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని.. ఈసీ గుర్తించిన పార్టీలు వచ్చాయా? లేదా? అనేది తెలియదని ఎన్​డీఏకు పరోక్షంగా చురకలంటించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని అన్నారు ఖర్గే. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో విపక్ష నాయకులపై దాడులు చేస్తోందని మండిపడ్డారు. దేశ ప్రయోజనాల పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా ఉండాలని ప్రతిపక్షాలను ఖర్గే కోరారు.

"దేశ ప్రజల ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి బెంగళూరు సమావేశం చాలా ముఖ్యమైనది. ఎన్నికల ప్రచార నిర్వహణ కోసం దిల్లీలో ఉమ్మడి సెక్రటేరియట్‌ను కూడా ఏర్పాటు చేస్తాం. అంశాల వారీగా నిర్దిష్ట కమిటీలను ఏర్పాటు చేస్తాం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి విజయం సాధిస్తాం. విపక్షాల భేటీకి 26 పార్టీల నాయకులు వచ్చారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ చాలా ముఖ్యం. విపక్ష కూటమికి ఐ.ఎన్‌.డి.ఐ.ఏగా నామకరణం చేశాం. విపక్ష కూటమి పేరును అన్ని పార్టీల నేతలు అంగీకరించారు. 26 పార్టీలతో ప్రతిపక్ష కూటమి ఏర్పాటు చేస్తున్నాం. పట్నా భేటీలో 16 పార్టీలు సమావేశమైతే.. బెంగళూరు ప్రతిపక్షాల భేటీకి 26 పార్టీలు హాజరయ్యాయి. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఉమ్మడిగా పోరాడతాం. పోరాటంలో విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. కేంద్ర ప్రభుత్వ పాలనపై అందరూ విసిగిపోయారు. "

--మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు

Opposition Meeting Mamata Banerjee : బీజేపీ ప్రభుత్వంపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు పని.. ప్రభుత్వాన్ని కొనడం, అమ్మడమేనని మమత ఎద్దేవా చేశారు. భారత్​ గెలుస్తుంది.. బీజేపీ ఓడిపోతుందని నినాదాన్ని మమత ఇచ్చారు. 'వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ వేధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడంపైనే బీజేపీ దృష్టి ఉంది. దేశ ప్రజల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. విపత్తు నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సి ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ స్వతంత్రంగా పనిచేయనీయట్లేదు' అని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.

  • #WATCH | "NDA, can you challenge I.N.D.I.A?," asks TMC leader and West Bengal CM Mamata Banerjee in Bengaluru.

    The Opposition alliance for 2024 polls is called Indian National Developmental Inclusive Alliance - I.N.D.I.A. pic.twitter.com/0buyBVste5

'బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం'
Opposition Unity Rahul Gandhi : బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. విపక్షాల పోరాటాన్ని బీజేపీకి వ్యతిరేకంగా భావించవద్దని.. దేశ ప్రజల గొంతుక అణచివేతపై పోరాటంగా భావించాలని రాహుల్‌ కోరారు. ' INDIA, ఎన్​డీఏ మధ్య పోరాటం ఇది. దేశ భావజాల పరిరక్షణ కోసం ప్రతిపక్షాలు పోరాటం చేస్తున్నాయి.' అని రాహుల్ గాంధీ తెలిపారు.

  • #WATCH | Congress leader Rahul Gandhi says, "The fight is against BJP and its ideology. This fight is between India and Narendra Modi," in Bengaluru. pic.twitter.com/qmgOgHSoAl

'విపక్షాల భేటీ సక్సెస్​'
Opposition Alliance Name : విజయవంతంగా విపక్ష కూటమి రెండో భేటీ నిర్వహించామని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. దేశాన్ని రక్షించేందుకు అందరూ కలిసికట్టుగా పోరాడుతున్నామని తెలిపారు. ముంబయిలో విపక్ష కూటమి తదుపరి భేటీ ఉంటుందని ఉద్ధవ్ వెల్లడించారు.

9 ఏళ్ల పాలనలో అన్నీ అమ్మకానికే: కేజ్రీవాల్
Kejriwal Opposition Meet : తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో ప్రతి రంగాన్ని నాశనం చేసిందని అన్నారు ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌. రైల్వే, విమానాశ్రయాలను, ఓడరేవులను అమ్మకానికి పెట్టారని కేంద్రంలోని బీజేపీ సర్కారుపై మండిపడ్డారు. బీజేపీ సర్కారు వల్ల యువత, రైతులు, వ్యాపారులందరూ బాధపడుతున్నారని తెలిపారు. 'భారతదేశ కలలను అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. యువతకు ఉపాధి, ప్రజలకు వైద్యం అందాల్సి ఉంది.' అని కేజ్రీవాల్‌ అన్నారు.

  • #WATCH | In the last 9 years, PM Modi could have done a lot of things but he destroyed all the sectors. We have gathered here not for ourselves but to save the country from hatred..., says AAP supremo and Delhi CM Arvind Kejriwal pic.twitter.com/gqqhuJnZBX

Last Updated : Jul 18, 2023, 6:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.