ETV Bharat / bharat

'ప్రజల మధ్య కనిపించరు.. ట్విట్టర్​లోనే దర్శనం' - చిదంబరం vs నడ్డా తాజా వార్తలు

కరోనా విజృంభణ కొనసాగుతున్న తరుణంలో ట్విట్టర్​ లేదా విలేకరుల సమావేశాల్లో మాత్రమే ప్రతిపక్ష నేతలు కనిపిస్తున్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. అదే సమయంలో తమ పార్టీ ప్రజలకు సాయం చేసే పనిలో నిమగ్నమై ఉందని చెప్పారు. వ్యాక్సిన్ల విషయంలో ప్రజలను కాంగ్రెస్​ గందరగోళానికి గురి చేస్తోందని ఆరోపించారు.

jp nadda, bjp national president
జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు
author img

By

Published : Jun 23, 2021, 9:09 PM IST

కొవిడ్​ విజృంభణ వేళ తమ పార్టీ.. ప్రజలకు సాయపడుతోంటే ప్రతిపక్ష నేతలు మాత్రం సామాజిక మాధ్యమాలకే పరిమితమయ్యారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. ట్విట్టర్​ లేదా విలేకరుల సమావేశంలో మాత్రమే వాళ్లు కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. భాజపా మినహా అన్ని పార్టీలు క్వారంటైన్​లోకి వెళ్లాయని వ్యాఖ్యానించారు. మరికొన్ని పార్టీలైతే ఐసీయూలో కాలం వెళ్లదీస్తున్నాయన్నారు. భాజపా సిద్ధాంతకర్త శ్యామ ప్రసాధ్​ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా దిల్లీలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

"కొవిడ్​ టీకాల విషయంలో ప్రజలను కాంగ్రెస్​ తప్పుదోవ పట్టిస్తోంది. అదే సమయంలో ఆ పార్టీకి చెందిన నేతలు మౌనంగా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఏ కాంగ్రెస్​ నేతైనా నిల్చుని తాను టీకా వేయించుకోలేదని చెప్పగలరా? కరోనా విజృంభణ సమయంలో మేము సాధక్​లుగా వ్యవహరిస్తోంటే.. ప్రతిపక్షమేమో బాధక్​లాగా వ్యవహరిస్తోంది."

-జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

శ్యామ్​ ప్రసాద్​ మఖర్జీ వర్ధంతిని పురస్కరించుకుని దిల్లీలోని భాజపా కార్యాలయంలో కరోనా సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నడ్డా ప్రారంభించారు. శ్యామ​ ప్రసాద్​ ముఖర్జీకి నివాళిగా.. జులై 6 వరకు తమ పార్టీ కార్యకర్తలు 5 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

ఈ ఏడాది చివరినాటికి భారత్​ 257 కోట్ల టీకా డోసులను సమకూర్చుకుంటుందని నడ్డా పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన కొవిడ్​ వ్యతిరేక పోరులో ప్రజలు అపూర్వ మద్దతునిస్తున్నారని తెలిపారు.

'అది.. తరతరాల సంప్రదాయమే'

భారత్​లో సోమవారం రికార్డు స్థాయిలో జరిగిన టీకా పంపిణీ.. ఆ మరుసటి రోజు గణనీయంగా తగ్గింది. దీంతో కేంద్రంపై విమర్శలు గుప్పించారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్​ నేత పి. చిదంబరం. "ఆదివారం కూడబెట్టి.. సోమవారం వ్యాక్సిన్‌ వేసి.. మంగళవారం తిరిగి నెమ్మదించడమే- వ్యాక్సినేషన్‌లో 'ప్రపంచ రికార్డు' వెనుక రహస్యమిదే" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపై నడ్డా ట్విట్టర్​ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీకా పంపిణీలో భారత్ ​ నెమ్మదించలేదన్న ఆయన.. మంగళ, బుధవారాల్లోనూ 50 లక్షల డోసులను పంపిణీ చేసిందని పేర్కొన్నారు. దేశం​ ఏదైనా రికార్డు సాధిస్తే తట్టుకోలేకపోవటం.. కాంగ్రెస్​ సంప్రదాయమేనని విమర్శించారు.

ఇదీ చూడండి: పేదలకు మరో 5 నెలలు ఉచిత రేషన్​

ఇదీ చూడండి: 'దేశ సమగ్రతలో ఆయన కృషి చిరస్మరణీయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.