పెగసస్ వ్యవహారాన్ని సూచిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రతి ఒక్క భారతీయుడి ఫోన్ని కేంద్ర ట్యాప్ చేసిందని ఆరోపించారు. పెగసస్పై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత వర్షకాల సమావేశాల్లో పెగసస్పై చర్చ చేపట్టకపోవటంపై ప్రశ్నించారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద అన్నదాతలు ఆందోళన చేస్తున్న ప్రాంతానికి వెళ్లి సంఘీభావం తెలిపాయి 14 విపక్ష పార్టీలు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై విమర్శలు చేశారు రాహుల్.
" సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతు పలికేందుకు ఈరోజు విపక్ష పార్టీలన్నీ జంతర్ మంతర్ వద్దకు వచ్చాయి. పెగసస్పై చర్చ చేపట్టాలని మనం కోరుతుంటే, కేంద్ర అందుకు సుముఖంగా లేదు. ప్రతి ఒక్క భారతీయుడి ఫోన్ను నరేంద్ర మోదీ ట్యాప్ చేశారు. "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత.
అన్నదాతలను కాపాడండి.. దేశాన్ని రక్షించండి
రాహుల్ గాంధీతో పాటు రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే సైతం ఈ నిరసనల్లో పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సహా డీఎంకే, టీఎంసీ, ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, ఎస్పీ, వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు.. రైతలకు మద్దతు ప్రకటించారు. రైతులను కాపాడండి.. దేశాన్ని రక్షించండి అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు.
పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు నుంచే పెగసస్ సహా రైతుల ఆందోళన, సాగు చట్టాల రద్దుపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు. నిరసనలతో ఉభయ సభలు వాయిదాల పర్వంతో ముందుకు సాగుతున్నాయి.
-
#WATCH | Congress leader Rahul Gandhi and other Opposition leaders reach Jantar Mantar, Delhi to extend support to farmers in their protest against farm laws by raising slogans with a placard 'Save Farmers, Save India' pic.twitter.com/VMyi4ShlYo
— ANI (@ANI) August 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Congress leader Rahul Gandhi and other Opposition leaders reach Jantar Mantar, Delhi to extend support to farmers in their protest against farm laws by raising slogans with a placard 'Save Farmers, Save India' pic.twitter.com/VMyi4ShlYo
— ANI (@ANI) August 6, 2021#WATCH | Congress leader Rahul Gandhi and other Opposition leaders reach Jantar Mantar, Delhi to extend support to farmers in their protest against farm laws by raising slogans with a placard 'Save Farmers, Save India' pic.twitter.com/VMyi4ShlYo
— ANI (@ANI) August 6, 2021
ఇదీ చూడండి: ఉభయ సభల్లో అదే రగడ- కీలక బిల్లులకు ఆమోదం