ETV Bharat / bharat

కరోనా టీకాపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి: భాజపా - భారత్​ బయోటిక్​

కొవాగ్జిన్ టీకాపై ప్రతిపక్షాలు స్వార్థరాజకీయాలు చేస్తున్నాయని భాజపా అధికార ప్రతినిధి సంబిత్​ పాత్రా అన్నారు. 40 దేశాలు కొవాగ్జిన్ వ్యాక్సిన్​కు ఆర్డర్లు తీసుకుంటే.. ఇక్కడి ప్రతిపక్షాలు మాత్రం టీకా సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయని విమర్శించారు.

Opposition did politics over COVID vaccine: BJP
'కరోనా టీకాపై రాజకీయం చేస్తోన్న ప్రతిపక్షాలు'
author img

By

Published : Mar 5, 2021, 6:01 PM IST

కరోనా టీకాపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని భాజపా ఆరోపించింది. ముఖ్యంగా టీకాపై కాంగ్రెస్​ రాజకీయం చేస్తోందని, ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తోందని విమర్శించింది.

"భారత్​ బయోటెక్​ తయారు చేసిన కొవాగ్జిన్​ సామర్థ్యాన్ని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. ముఖ్యంగా వారు అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేరళ, పంజాబ్​, ఛత్తీస్​గఢ్​, బంగాల్​, ఝార్ఖండ్​లు కొవాగ్జిన్​ టీకా సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. భారత శాస్త్రవేత్తల్ని మీరు(ప్రతిపక్షాలు) నమ్మటం లేదా? 40 దేశాలు కొవాగ్జిన్​ టీకా కావాలని అడిగాయి. కానీ ఇండియాలోని ప్రతిపక్షాలు.. టీకాపై స్వార్థ రాజకీయాలు చేస్తున్నాయి."

-సంబిత్​ పాత్రా, భాజపా అధికార ప్రతినిధి

ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా ఎందుకు తీసుకోలేదని ప్రతిపక్షాలు విమర్శించాయని, ఇప్పుడు మోదీ కొవాగ్జిన్​ టీకా తీసుకుని వ్యాక్సిన్​ సామర్థాన్ని నిరూపించారని అన్నారు.

భారత్​ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్​ టీకా 81శాతం సమర్థవంతంగా పని చేస్తుందని ఇటీవల తేలింది.

ఇదీ చూడండి: 'కొవాగ్జిన్ టీకా 81% సమర్థవంతం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.