జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో విపక్ష కూటమి 'ఇండియా' ఎంపీలు ఈ నెల 29, 30 తేదీల్లో పర్యటించనున్నారు. 20 మంది ఎంపీలతో కూడిన ప్రతినిధుల బృందం మణిపుర్‌లో పర్యటించి అక్కడి పరిస్థితి తెలుసుకోనుందని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. గతంలో కూడా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు మణిపుర్‌ను సందర్శించాలని భావించినా అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వారికి అనుమతి లభించలేదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం మణిపుర్‌లో కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. విపక్ష కూటమి ఇండియాలో మొత్తం 26 పార్టీలు ఉన్నాయి. మణిపుర్ అంశంపై ప్రధాని మోదీ పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే మోదీ సర్కారుపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా దానికి అనుమతి ఇచ్చారు.
Rahul Gandhi Manipur : నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని కాదని, కొంతమంది ఆర్ఎస్ఎస్ వర్గాలకు మాత్రమే ప్రధాని అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. యూత్ కాంగ్రెస్ సమావేశాన్ని ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించిన రాహుల్.. మణిపుర్ కోసం ప్రధాని ఏం చేశారని ప్రశ్నించారు. తమ భావజాలమే మణిపుర్‌ను ఈ స్థితికి తీసుకొచ్చిందన్న విషయం ప్రధానికి తెలుసని అన్నారు. విపక్ష కూటమి తమ పేరును ఇండియాగా పెట్టుకుంటే.. మోదీ ఏకంగా దేశాన్నే అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ విద్వేష దుకాణాన్ని తెరిచిన ప్రతిచోట.. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రేమ అంగళ్లను తెరవాలని పిలుపునిచ్చారు.
-
BJP-RSS सिर्फ सत्ता चाहती है और सत्ता पाने के लिए ये कुछ भी कर सकती है।
— Congress (@INCIndia) July 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
सत्ता के लिए ये मणिपुर को जला देंगे, सारे देश को जला देंगे।
इनको देश के दुख और दर्द से कोई फर्क नहीं पड़ता।
: @RahulGandhi जी pic.twitter.com/7Cp7cWXsjX
">BJP-RSS सिर्फ सत्ता चाहती है और सत्ता पाने के लिए ये कुछ भी कर सकती है।
— Congress (@INCIndia) July 27, 2023
सत्ता के लिए ये मणिपुर को जला देंगे, सारे देश को जला देंगे।
इनको देश के दुख और दर्द से कोई फर्क नहीं पड़ता।
: @RahulGandhi जी pic.twitter.com/7Cp7cWXsjXBJP-RSS सिर्फ सत्ता चाहती है और सत्ता पाने के लिए ये कुछ भी कर सकती है।
— Congress (@INCIndia) July 27, 2023
सत्ता के लिए ये मणिपुर को जला देंगे, सारे देश को जला देंगे।
इनको देश के दुख और दर्द से कोई फर्क नहीं पड़ता।
: @RahulGandhi जी pic.twitter.com/7Cp7cWXsjX
"బీజేపీ-ఆర్ఎస్ఎస్ అధికారం కోసం ఏమైనా చేస్తాయి. అధికారం కోసం మణిపుర్‌నే కాదు దేశం మొత్తాన్ని మంటల్లో నెట్టేస్తారు. యావద్దేశాన్ని అమ్మేస్తారు. దేశ ప్రజల బాధల గురించి వారు పట్టించుకోరు. దేశభక్తి ఉన్న ఎవరికైనా పౌరుల బాధలు తెలుస్తాయి. కానీ, బీజేపీ-ఆర్ఎస్ఎస్కు ఆ బాధ తెలియదు. ఎందుకంటే దేశాన్ని విభజించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ-ఆర్ఎస్ఎస్కు, కాంగ్రెస్‌కు మధ్య భావజాల యుద్ధం జరుగుతోంది. రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చూసే కాంగ్రెస్ ఓవైపు.. కొంతమంది చేతుల మీదుగానే దేశం నడవాలని, సంపద మొత్తం తమ చేతుల్లోనే ఉండాలని అనుకునే ఆర్ఎస్ఎస్-బీజేపీ మరోవైపు ఉన్నాయి. "
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు
Parliament Monsoon session : మరోవైపు, మణిపుర్ అంశంపై చర్చించాలని కోరుతూ రాజ్యసభలో విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. అధికార, విపక్ష సభ్యుల నినాదాలతో మధ్యాహ్న భోజన విరామానికి ముందే రెండుసార్లు సభ వాయిదా పడింది. తిరిగి సమావేశమైన తర్వాత కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.. 2023 సినిమాటోగ్రఫీ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీనిపై మాట్లాడేందుకు విపక్షనేత మల్లికార్జున ఖర్గేకు సభాపతి అనుమతి ఇచ్చారు. అయితే, తాను బిల్లు గురించే కాకుండా మనసులో మాట కూడా చెబుతానని ఖర్గే.. మణిపుర్ అంశాన్ని ప్రస్తావించారు. దీనికి సభాపతి అనుమతించలేదు. బిల్లువరకే పరిమితం కావాలని సూచించారు. దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అటు.. లోక్‌సభలోనూ వాయిదాల పర్వమే కొనసాగింది. కేంద్ర మంత్రి జైశంకర్ ప్రకటనకు కొందరు అడ్డుతగలడం.. ప్రభుత్వ, విపక్ష ఎంపీల మధ్య వాగ్యుద్ధానికి దారితీసింది.
-
#WATCH | NDA MPs chant "Modi, Modi" in Rajya Sabha as EAM Dr S Jaishankar makes a statement on the latest developments in India's Foreign Policy. To counter this, INDIA alliance MPs chant "INDIA, INDIA." pic.twitter.com/REJgfm50h2
— ANI (@ANI) July 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | NDA MPs chant "Modi, Modi" in Rajya Sabha as EAM Dr S Jaishankar makes a statement on the latest developments in India's Foreign Policy. To counter this, INDIA alliance MPs chant "INDIA, INDIA." pic.twitter.com/REJgfm50h2
— ANI (@ANI) July 27, 2023#WATCH | NDA MPs chant "Modi, Modi" in Rajya Sabha as EAM Dr S Jaishankar makes a statement on the latest developments in India's Foreign Policy. To counter this, INDIA alliance MPs chant "INDIA, INDIA." pic.twitter.com/REJgfm50h2
— ANI (@ANI) July 27, 2023