అమర్నాథ్ యాత్రకు వెళ్లాలనుకునేవారు ఈ నెల 15 నుంచి ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని సోమవారం అధికారవర్గాలు తెలిపాయి. జూన్ 28న ప్రారంభమయ్యే ఈ యాత్ర ఆగష్టు 22 వరకు మొత్తం 56 రోజులపాటు కొనసాగుతుంది. రెండు మార్గాలైన బల్తాల్, చందన్వారీల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.
శ్రీ అమర్నాథ్జీ దేవస్థానం బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీతీశ్వర్ కుమార్ మాట్లాడుతూ యాత్రికులు తమ పేర్లను www.jksasb.nic.in లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. పేర్ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అన్ని వివరాలు దేవస్థానం వెబ్సైట్ www.shriamarnathjishrine.com లో ఉన్నాయని వివరించారు. ఫొటోతో పాటు, ఆరోగ్య ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మార్చి 15 తరువాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలనే ఆమోదిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: బావిలో పడ్డ శునకాన్ని రక్షించిన 'సాహస' మహిళ