Online Game Addiction: ఫ్రీ ఫైర్ గేమ్‌కు బానిసయ్యాడు ఓ 17 ఏళ్ల విద్యార్థి. సెల్‌ఫోన్‌లో నిత్యం గేమ్ ఆడడం వల్ల బాలుడి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడింది. ఎవరితో సంబంధం లేకుండా తన లోకంలో తాను బతుకుతున్నాడు. గేమ్ ఆడుతున్నాన్న భ్రమతోనే చేతులు ఊపుతున్నాడు. రెండు చేతులతో గన్ పట్టుకుని పేల్చుతున్నట్లు ఊహించుకుని కలవరిస్తున్నాడు. బాధితుని తల్లిదండ్రులు కుమారుని వింత ప్రవర్తన పట్ల ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన తమిళనాడులోని తిరునెల్వేలిలో జరిగింది. బాధితుడికి ఈ నెల 4 నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్నారు. తమ పిల్లలు సెల్ఫోన్లకు బానిసగా మారకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
బాధితుడు నంగునేరికి చెందిన విద్యార్థి. సెల్‌ఫోన్‌లో నిరంతరం ఫ్రీ ఫైర్ గేమ్ ఆడటం వల్ల ఇలా మానసిక అనారోగ్యానికి గురయ్యాడని వైద్యులు చెప్పారు. ఇదిలా ఉండగా విద్యార్థులు స్మార్ట్‌ఫోన్ గేమ్‌లకు బానిసలుగా మారకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్‌పై నిషేధం విధించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ 'మాస్టర్' ప్లాన్.. రంగంలోకి పీకే!